• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొంపముంచిన పరిశోధన -గబ్బిలాల గుహకు చైనా శాస్త్రవేత్తలు -అక్కడే కరోనాకు బీజం

|

ప్రపంచంపై ఆదిపత్యం కోసం మంచి చెడు అని చూడకుండా చైనా చేస్తున్న అతి ప్రపంచానికి చేటు తెచ్చింది. ప్రమాదకర గబ్బిలాల గుహలపై చైనా పరిశోధకులు చేసిన పరిశోధన మానవాళికి ముప్పుగా మారిందని తెలుస్తోంది. కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై డబ్ల్యుహెచ్ వో చేస్తున్న విచారణలో వీస్తూపోయే నిజాలు వెల్లడవుతున్నాయి..

'కర్ణాటక'ను మహారాష్ట్రలో కలిపేస్తాం -సీఎం ఉద్ధవ్ సంచలనం -మళ్లీ తెరపైకి బెల్గామ్ సరిహద్దు వివాదం

గబ్బిలాల గుహలోకి వెళ్లి..

గబ్బిలాల గుహలోకి వెళ్లి..

లైవ్ వైరస్‌లపై పరిశోధన చేసే చైనా శాస్త్రవేత్తలు చాలా అజాగ్రత్తగా ప్రవర్తించినట్లు తాజా నివేదికలు తేల్చి చెబుతున్నాయి . ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిబంధనలను పాటించకుండా, గ్లోవ్స్, మాస్క్‌లు ధరించకుండా ఓ గుహలో నమూనాలను సేకరించినట్లు బయటపడింది. ఈ గుహలో కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు అంగీకరించారు. దీంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

చీకటి గుహలో గబ్బిలం కాటు..

చీకటి గుహలో గబ్బిలం కాటు..

చైనాలోని వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు గతంలో ఓ గుహలో గబ్బిలాల నమూనాలను సేకరించారు. కరోనా వైరస్ సోకిన గబ్బిలాలకు కేంద్రంగా ఈ గుహ ఉంది. ఈ నమూనాల సేకరణలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తమను ఈ వైరస్ సోకిన గబ్బిలాలు కుట్టినట్లు అంగీకరించారని ఆదివారం అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తన రబ్బర్ గ్లోవ్స్‌లోకి ఓ గబ్బిలం కోర సూదిలాగా గుచ్చుకుందని ఓ శాస్త్రవేత్త చెప్పారని మీడియా పేర్కొంది. ఈ సంఘటన 2017లో జరిగిందని ఆ శాస్త్రవేత్త చెప్పారని పేర్కొంది.

 చైనీస్ సైంటిస్టుల నిర్లక్ష్యం..

చైనీస్ సైంటిస్టుల నిర్లక్ష్యం..

అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చాలా రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ సంస్థలోని సిబ్బంది కూడా డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను పాటించకుండా గబ్బిలాలతో వ్యవహరించారని చైనీస్ టీవీ సిబ్బంది సేకరించిన ఓ వీడియోలో బయటపడింది. ఈ వీడియో ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేయడానికి రెండేళ్ళ ముందు అంటే, 2017లో ప్రసారమైంది. ఓ శాస్త్రవేత్త తన చేతులకు ఎటువంటి గ్లోవ్స్ లేదా ఇతర రక్షణ లేకుండా గబ్బిలాన్ని పట్టుకున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఓ రీసెర్చర్ మాట్లాడుతూ, ఓ గబ్బిలం తన చేతికిగల రబ్బర్ గ్లోవ్స్‌లోపలికి తన కోరను సూదిలాగా గుచ్చిందని చెప్పారు. దీంతో ఈ శాస్త్రవేత్తలకు అప్పట్లోనే కరోనా వైరస్ సోకిందా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆ వైరస్ కోవిడ్-19 అయినా కావచ్చుననే ఆలోచన వస్తోంది.

డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తు..

డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తు..

వైరస్ పుట్టుక, వ్యాప్తికి చైనానే కారణం అని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, దానిపై దర్యాప్తు చేసేందుకు ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ బృందం వూహన్‌లో కోవిడ్-19కు మూలమైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ బృందం మరింత క్షుణ్ణంగా పరిశీలన జరపవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. కోవిడ్-19 వ్యాధికి కారణమైన నోవల్ కరోనా వైరస్‌ను మొదట వూహన్‌లో 2019 చివర్లో గుర్తించిన సంగతి తెలిసిందే.

కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్

English summary
Scientists at the Wuhan laboratory in China have admitted "being bitten while collecting samples in a cave" which is home to coronavirus-infected bats. According to a report on Sunday, a researcher said that "one animal's fangs had gone through his rubber gloves like a needle while he was collecting samples in a cave" in 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X