పాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్, భారత్‌పై ఇలా
పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తే మరెంతో కాలం సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
వాషింగ్టన్: పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తే మరెంతో కాలం సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
ఉగ్రవాదులకు అనుకూలంగా ఉంటే పాకిస్తాన్ అందుకు ఫలితం అనుభవించాల్సి ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉండటంపై తాము చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

లేదంటే ఆపేస్తామని హెచ్చరిక
ఆప్గనిస్తాన్‌లో అమెరికన్ ఆపరేషన్‌లో భాగస్వామిగా పాకిస్తాన్ ఎంతో లాభపడిందని ట్రంప్ చెప్పారు. అయితే నేరస్తులు, క్రిమినల్స్‌కు ఆశ్రయం కల్పించడం ద్వారా పాకిస్తాన్ దెబ్బతింటుందన్నారు. ఉగ్రవాదులపై పాకిస్తాన్ కఠిన వైఖరి అవలంభించకుంటే ఆ దేశానికి అమెరికా అందించే సైనిక, ఇతర సాయాలు నిలిచిపోతాయని హెచ్చరించారు.
Recommended Video


మేం బిలియన్ డాలర్లు ఇస్తుంటే
ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం తాము బిలియన్ డాలర్లను ఇస్తున్నామని, కానీ తాము పోరాడుతున్న ఉగ్రవాదులకే అది ఆశ్రయం కల్పిస్తోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ఊతమిచ్చే వైఖరికి పాక్ తక్షణమే స్వస్తి పలకాలన్నారు. నాగరికత, శాంతి సామరస్యాలు వెల్లివిరిసే సమాజం నెలకొనేందుకు పాక్ అంకితం కావాలన్నారు.

భారత్ మరింత చొరవ చూపాలి
ఆప్గనిస్తాన్‌లో సుస్థిరత నెలకొనేందుకు భారత్ అందించిన సహకారం మరువలేనిదని ట్రంప్ అన్నారు. అయితే అమెరికాతో వాణిజ్యం ద్వారా బిలియన్ డాలర్ల రాబడి పొందుతున్న భారత్.. ఆప్గన్ విషయంలో ముఖ్యంగా ఆర్థిక చేయూత, అభివృద్ధి పరంగా మరింత సహకరించాలని కోరారు.

భారత్ కీలక భాగస్వామి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ తమకు కీలక భద్రత, ఆర్థిక భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తమ దక్షిణాసియా విధానాన్ని వివరించారు. భారత్‌తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతమే తమకు అత్యంత కీలకమని చెప్పారు.
-
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..!












Click it and Unblock the Notifications