సిసలైన హీరో జెలెన్ స్కీ-యుద్ధం వదిలి పారిపోను-ఆయుధాలివ్వండి-అమెరికాకు వినతి
ఉక్రెయిన్ పై ఆక్రోశంతో ఓవైపు రష్యా దండయాత్రకు దిగింది. కీలకమైన రాజధాని నగరం కీవ్ తో పాటు దేశంలో పలు ప్రాంతాల్ని హస్తగతం చేసుకునే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో ఏ దేశ పాలకుడైనా పారిపోయి ప్రాణాలు దక్కించుకోవాలని ఆశిస్తాడు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం అలా ఆలోచించలేదు. పారిపోయేందుకు సాయం చేస్తామంటూ అగ్రరాజ్యం అమెరికా ఆఫర్ ఇచ్చినా తోసిపుచ్చాడు. దానీకి బదులు ఆయుధాలివ్వడం పోరాడానంటున్నడు ఈ రియల్ హీరో..
Recommended Video

ఉక్రెయిన్ పోరులో సిసలైన హీరో
రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టగానే ఆ దేశం సులువుగా లొంగిపోవడం ఖాయమని అంతా భావించారు. కానీ 48 గంటలు గడుస్తున్నా రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కూడా స్వాధీనం చేసుకోలేకపోయింది. మరోవైపు రష్యాన్ సైనికులు వెయ్యి మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. రష్యా హెలికాఫ్టర్లను, యుద్ధ విమానాలను ఉక్రెయిన్ దళాలు కూల్చేస్తున్నాయి. ఉక్రెయిన్ లో పౌరులు సైతం ఆయుధాలు పట్టి రష్యా భరతం పట్టేందుకు వీరుల్లా కదులుతున్నారు. దీని వెనుక ఉన్న సిససైన హీరో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్ స్కీ.

రష్యాకు ఎదురు నిలిచి
రష్యా అగ్రరాజ్యమని తెలుసు. రష్యా వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని తెలుసు. తమకంటే అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఆయుధాలు, సైన్యం, క్షిపణులు ఉన్నాయని తెలుసు. అయినా పోరాడితే పోయేదేముందని భావిస్తున్నాడు జెలెన్ స్కీ. అండగా ఉంటామని, సైన్యాలు పంపుతామని బీరాలు పలికిన అగ్రరాజ్యాలు హ్యాండిచ్చేసినా చలించకుండా పోరాటానికే మొగ్గు చూపుతున్నాడు జెలెన్ స్కీ. ఉక్రెయిన్ ను ఎలా కాపాడుకోవాలో తెలుసంటూ తన ప్రజల్లో ధైర్యం నింపుతున్నాడు. చావు తప్పదని తెలిసి యుద్ధరంగంలోకి నేరుగా దూకాడు. రష్యాకు చుక్కలు చూపిస్తూ తన ప్రజల్లో పోరాటపటిమ నింపుతున్నాడు.

అమెరికా ఆఫర్ తిరస్కారం
ఓవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చుట్టుముడుతున్న వేళ అధ్యక్షుడు జెలెన్ స్కీ సహా కీలక నేతల్ని అక్కడి నుంచి తప్పిస్తామంటూ అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. మరొక నేత అయితే వెంటనే ఆ ఆఫర్ కు అంగీకరించి పారిపోయి ఉండేవాడు. కానీ జెలెన్ స్కీ మాత్రం అమెరికా ఆఫర్ ను తిరస్కరించాడు. తనకు సాయం చేస్తానంటూ నమ్మబలికి చివరికి హ్యాండిచ్చిన అమెరికాపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న జెలెన్ స్కీ తన పోరు తాను చేసేందుకే మొగ్గు చూపుతున్నాడు. దీంతో అమెరికా సహా మిత్రరాజ్యాలు ఆ తెగువను చూసి నివ్వెరపోతున్నాయి.

ఆయుధాలిస్తే పోరాడానంటున్న జెలెన్ స్కీ
తనను ఉక్రెయిన్ నుంచి తప్పిస్తానంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్ ను గడ్డిపోచలా తీసిపారేసిన జెలెన్ స్కీ.. అందుకు బలుదుగా ఆయుధాలు ఇవ్వాలని కోరాడు. తనకు ఆయుధాలిస్తే రష్యాకు చుక్కలు చూపిస్తానంటూ అమెరికాకు స్పష్టం చేశాడు. దీంతో అమెరికా నిజంగానే ఇరుకునపడింది. " ఇంకా పోరాటం సజీవంగా ఉంది. నాకు మందుగుండు సామగ్రి కావాలి, తప్పించుకుపోవడం కాదంటూ అగ్రరాజ్యానికి జెలెన్ స్కీ స్పష్టం చేశాడు. దీంతో అగ్రరాజ్యం ఇప్పుడు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

సిసలైన నాయకుడు జెలెన్ స్కీ
రష్యా తమ దేశంపై దండయాత్ర చేస్తుందని తెలియగానే అప్రమత్తమైన జెలెన్ స్కీ.. తమ ప్రజల్ని కూడా అలర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంతే కాదు దేశంలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్ని దేశం వదిలి పోకుండా కఠిన ఆంక్షలు విధించాడు. అలాగే రిటైర్డ్ మిలటరీ అధికారుల సాయం కోరాడు. అంతే కాదు ఆయుధాలు వాడేందుకు ఆసక్తి ఉన్న ప్రజలందరికీ ఆయుధాలు పంచిపెట్టాడు. ఇలా 18 వేల మంది ఉక్రెయిన్ ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలు తీసుకుని యుద్ధ రంగంలోకి దూకారంటూ జెలెన్ స్కీ ప్రభావం వారిపై ఎంత మేరకు ఉందో అర్ధమవుతుంది. ఇదంతా చూస్తుంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోయినా జెలెన్ స్కీ మాత్రం సిసలైన హీరోగా మిగిలిపోవడం ఖాయంగా ఉంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications