IPL 2020: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, శ్రేయాస్ టాప్ ర్యాంక్ సాధించేనా?
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టీ20లో శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రెండు జట్లు కూడా బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఆట తీరులో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ మాత్రం చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

రాజస్థాన్ కంటే డిల్లీ మెరుగ్గా..
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమిపాలు కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును 59 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్ కంటే చాలా మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఢిల్లీ జట్టు మంచి ప్రదర్శనను కనబరుస్తోంది.

ఆ రెండు మ్యాచులు తప్ప..
ఐపీఎల్ 2020లో 216/7, 226/6, 137/9, 154/6, 136 స్కోర్లను నమోదు చేసింది. ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్.. కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో స్టీవ్ స్మిత్, సంజూ శామ్సన్ బాగా ఆడారు. ఆ తర్వాత జోష్ బట్లర్ కూడా ఇప్పుడు తన ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. అయితే, మిగితా ఆటగాళ్లు మాత్రం అంతగా రాణించడం లేదు.

టాప్ ర్యాంకుపై కన్నేసిన శ్రేయాస్
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో ఉత్తమమైన ప్రదర్శన చేస్తోంది. పృథ్వీషా, శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయిన్స్ లు రాణిస్తున్నారు. పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తర్వాత స్థానంలో ఢిల్లీ జట్టు ఉంది. రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచులో విజయం సాధిస్తే టాప్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది. కాగా, రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్ షార్జా స్టేడియంలో శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications