Virat Kohli: మరో బాంబు పేల్చిన రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్: ఆయన చివరి కోరిక అదే
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్ క్రికెట్ ప్రేమికులను పలకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్ ఐపీఎల్ అసలు సిసలు మజాను చూపించింది. బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామంగా చెప్పుకొనే ఈ మెగా టోర్నమెంట్‌లో బౌలర్లు రెచ్చిపోయారు. రెండు జట్లలోనూ బౌలర్లదే ఆధిపత్యం.
Recommended Video

రెండో మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్..
ఛేదించడానికి వీలుగా ఉండే ఓ మోస్తరు స్కోర్‌ను ముంబై ఇండియన్స్ అందుకోలేకపోయారు. ధోనీసేనను బౌలర్లు గెలిపించారు. సెకెండ్ హాఫ్‌లో రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత నైట్ రైడర్స్ తలపడబోతోన్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం దీనికి వేదికగా మారనుంది. రాయల్ ఛాలెంజర్స్‌కు జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో అయిదింట్లో నెగ్గింది ఆర్సీబీ.

కోహ్లీకి చివరి ఐపీఎల్
మొత్తం 10 పాయింట్లతో టాప్-3లో కొనసాగుతోంది. ఇవాన్ మోర్గాన్ కేప్టెన్సీలోని కోల్‌కత నైట్ రైడర్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఏడు మ్యాచుల్లో రెండింట్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి నాలుగు పాయింట్లే. కాగా- రాయల్ ఛాలెంజర్స్ కేప్టన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కేప్టెన్‌గా అతనికి ఆది చివరి ఐపీఎల్ టోర్నమెంట్. ఈ ఐపీఎల్ 2021 టోర్నమెంట్ ముగిసిన తరువాత రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కేప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పబోతోన్నాడు.

టీమ్‌లో ఓ ప్లేయర్‌గా
ఓ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేంత వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో ఓ ఆటగాడిగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు అబుధాబి షేక్ జయేద్ స్టేడియం నుంచి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మట్లకు కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈ ఏడాది ఎమిరేట్స్, ఒమన్‌లో ఏర్పాటు కానున్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ తరువాత వన్డే ఇంటర్నేషనల్స్, టీ20ల నుంచి కేప్టెన్‌గా తప్పుకోనున్నాడు. కొద్దిరోజుల కిందటే ఈ విషయాన్ని ప్రకటించాడు.

2013లో పగ్గాలు..
జట్టు మొత్తం నైపుణ్యం ఉన్న ఆటగాళ్లతో తొణికిసలాడుతోందని వ్యాఖ్యానించాడు. కేప్టెన్‌గా వైదొలగాలంటూ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని చెప్పాడు. ఓ అద్భుతమైన ఫ్రాంఛైజీకి తాను ఇన్ని సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తూ వచ్చానని అన్నాడు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించాడు విరాట్ కోహ్లీ. సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆర్సీబీ జట్టు టైటిల్ గెలవలేదు.

ఎమోషనల్ వీడియో..
అతని తరువాత రోహిత్ శర్మ టీమిండియా కేప్టెన్‌గా అపాయింట్ అవుతాడనేది బహిరంగ రహస్యం. రోహిత్ శర్మ నియామకం లాంఛనప్రాయమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు విరాట్ కోహ్లీ. తన నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కేప్టెన్‌గా తన ప్రయాణం అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో అయినా..
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ కేపెన్సీ రికార్డ్ 65-60 విన్ అండ్ లాస్‌గా ఉంది. అతని విన్నింగ్ పర్సంటేజీ 48.04. లోయెస్ట్ విన్నింగ్ రికార్డ్ ఇది. ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజీతో పోల్చుకుంటే.. ఇది చాలా తక్కువ. రోహిత్ శర్మ విజయాల శాతం 60.16గా నమోదైంది. కోహ్లీ కేప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 132 మ్యాచ్‌లను ఆడగా.. వాటిల్లో 60 మ్యాచుల్లో జట్టు విజయం సాధించింది. 65 మ్యాచ్‌లల్లో ఓడిపోయింది. కేప్టెన్‌గా చివరి ఐపీఎల్‌ను ఆడుతోన్న విరాట్ కోహ్లీ.. తన జట్టుకు ఈ సీజన్‌లో అయినా విజేతగా నిలపగలడో లేదో వేచి చూడాలి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications