Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ వేషాలకు తక్కువేం లేదు గానీ: పుష్ప అల్లు అర్జున్ అవతారంలో కేన్ మామ: తట్టుకోలేని ట్రోల్స్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వాళ కీలక మ్యాచ్ ఆడనుంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న హార్దిక్ పాండ్యా జట్టు జైత్రయాత్రకు బ్రేకులు వేయడానికి సమాయాత్తమౌతోంది. ఆ జట్టుకు పరాజయాన్ని పరిచయం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. మూడు మ్యాచ్‌లల్లో ఒక్క గెలుపుతోనే సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ఈ రాత్రితో తేలిపోతుంది.

గాడి తప్పిన కేన్ బ్యాటింగ్..

కారణాలు ఏమైనప్పటికీ- సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాక్‌బోన్, కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఆటతీరు ఇంకా గాడినపడట్లేదు. ఈ రిథమ్‌ను అందిపుచ్చుకోవట్లేదు. మునుపటిలాగా ధాటిగా ఆడట్లేదు. భారీ షాట్లను కొట్టే విషయంలో తడబడుతున్నాడు. కాస్త అతి జాగ్రత్తగా ఆడుతున్నట్టే కనిపిస్తోన్నాడు కేన్. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ నింపాదిగా ఆడాడు. అదేదో టెస్ట్ మ్యాచ్ అనే ఫీలింగ్ కల్పించాడు అభిమానులకు.

40 బంతుల్లో..

చెన్నైతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ కాసిన్ని పరుగులు చేయడానికి అతను తీసుకున్న బంతులు.. 40. టీ20 ఫార్మట్‌కు ఏ మాత్రం తగని, అతకని ఆట ఇది. కాస్త గట్టిగా పోరాడితే సాధించ దగ్గ స్కోరే కావడంతో సన్‌రైజర్స్ పెద్దగా ఆందోళన చెందలేదు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడటంతో 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఆరెంజ్ ఆర్మీ. ఏ మాత్రం తేడా కొట్టినా ఫలితం మరోలా ఉండేదే.

గుజరాత్‌ ధాటికి తట్టుకుంటుందా?

గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. ఈ మూడు జట్లపైనా సాధించిన విక్టరీ.. విమర్శకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటిదాకా ఓటమి అనేదే చవి చూడలేదు. హార్దిక్ పాండ్యా టీమ్‌ సమష్టిగా సత్తా చాటుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇలాంటి జట్టు దూకుడును సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

ఎలివేషన్లకు తక్కువేం లేదు..

తనకంటే అన్ని రంగాల్లోనూ బలమైన గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్‌కు చెందిన ఓ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫొటో చేసింది. లేటెస్ట్ పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ ఫొటోను మార్ఫ్ చేసింది. కేన్ విలియమ్సన్‌‌దిగా డిజైన్ చేసింది. మరో గెలుపు కోసం అన్వేషిస్తోన్నాం అనే క్యాప్షన్‌ను దానికి జోడించింది. ఈ రకమైన ఎలివేషన్స్ ఇవ్వడం సన్‌రైజర్స్‌కు కొత్త కాదు. ఇదివరకు సర్కారువారి పాటలో మహేష్ బాబు స్టిల్‌ను ఇలాగే కేన్ విలియమ్సన్ కోసం యూజ్ చేసింది.

ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్ ఝులిపించు మామా..

ఈ సీజన్‌లో ఇప్పటిదాకా కేన్ విలియమ్సన్ చేసింది 50 పరుగులు. తొలి మ్యాచ్‌లో రెండు పరుగులకే వివాదాస్పదమైన క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. 16 పరుగులకే వెనుదిరిగాడు. ఇవ్వాళ గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టనుంది అతని సారథ్యంలోని సన్‌రైజర్స్. బ్యాటింగ్ వనరులు పరిమితంగా ఉన్న జట్టు ఇది. ఈ డిపార్ట్‌మెంట్ మొత్తం కేన్ మామ మీదే డిపెండ్ అయివుంది. అలాంటి అతనే పుంజుకోలేకపోతే- దాని బ్యాడ్ ఇంపాక్ట్.. జట్టుపై తీవ్రంగా పడుతుంది. ఈ మ్యాచ్‌నైనా కేన్ విలియమ్సన్ ఆటతీరు గాడినపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+