IPL 2023: RCBకి భారీ ఎదురుదెబ్బ-ఫస్టాఫ్ కు స్టార్ బ్యాటర్ రజత్ పటీదార్ దూరం..!
బెంగళూరు : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను ఉత్సాహంగా ప్రారంభించేందుకు సిద్దమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఫిట్ నెస్ లేమితో ఈ సారి టోర్నీకి అనుమానంగా మారారు. ఇదే క్రమంలో టాప్ బ్యాటర్ రజత్ పటీదార్ కూడా టోర్నీలో సగం మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదని తేలిపోయింది.
గత సీజన్లో ఆర్సీబీ తరఫున టాప్ పర్ ఫార్మర్ గా ఉన్న రజత్ పటీదార్..తాజాగా ప్రాస్టీస్ సందర్భంగా మడమకు గాయం కాడంతో బాధపడుతున్నాడు. దీంతో పటీదార్ ను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపి చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పటీదార్ ఆర్సీబీ ఫస్టాఫ్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదని జట్టు వర్గాలు తెలిపాయి.
అలాగే జట్టులో ఉన్న మరో స్టార్ ఆగగాడు, ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా టోర్నమెంట్‌లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో హేజిల్ వుడ్ ఆడతాడా లేదా అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

రజత్ పటీదార్ విషయానికి వస్తే అతని గాయం దృష్ట్యా డాక్టర్లు మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎంఆర్ఐ స్కాన్ తీసి అతని ఫిట్ నెస్ నిర్ధారించే అవకాశం ఉంది. ఆర్సీబీ శిబిరంలో చేరడానికి ముందు గాయంతో బాధపడుతున్న పాటిదార్‌కు తిరిగి జట్టులోకి వెళ్లడానికి జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గత ఏడాది మెగా వేలంలో ఎంపిక కాలేకపోయిన పాటిదార్, వికెట్ కీపర్ లువ్నిత్ సిసోడియాకు గాయం కావడంతో సీజన్ మధ్యలో జట్టుతో చేరాడు.టోర్నమెంట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని కొట్టడం ద్వారా ఎలిమినేటర్‌లో సంచలనం రేపాడు.
ఏడు మ్యాచ్‌లలో 152.75 స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులతో పాటిదార్ ఆర్సీబీ తరపున డు ప్లెసిస్, విరాట్ కోహ్లి తర్వాత మూడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గత సీజన్‌ను ముగించాడు.












Click it and Unblock the Notifications