IPL 2023 : అర్జున్ టెండూల్కర్ లోపాలివే -సచిన్ లా సరిచేసుకుంటే- పాక్ మాజీ కెప్టెన్ విశ్లేషణ..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేశాడు. రెండేళ్ల క్రితమే ముంబై జట్టుకు ఎంపికైనా ఆడే అవకాశం రాని అర్జున్.. ఈ సీజన్ లో మాత్రం తుదిజట్టులో చేరాడు. దీంతో వరుసగా రెండు మ్యాచ్ లు ఆడాడు. ఇందులో కోల్ కతాతో మ్యాచ్ తో పాటు హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో హైదరాబాద్ పై తొలి వికెట్ తీశాడు. దీనిపై క్రికెట్ దిగ్గజాలంతా స్పందించారు.
హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్ పై క్రికెట్ దిగ్గజాలతో పాటు పలువురు స్టార్లు, సెలబ్రిటీలు కూడా స్పందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు అర్జున్ టెండూల్కర్ ఆటతీరును కూడా విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ కూడా అయిన రషీద్ లతీఫ్ అర్జున్ బౌలింగ్ పై స్పందించాడు. ముఖ్యంగా అర్జున్ బౌలింగ్ తీరు, అలైన్ మెంట్ వంటి విషయాలపై తన అభిప్రాయాలు వెల్లడించాడు.

పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. అర్జున్ తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్నాడని, చాలా కష్టపడాలని తెలిపాడు. అతని అలైన్‌మెంట్ బాగాలేదని, పేస్‌ని జనరేట్ చేయడంలోనూ విఫలమవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒక మంచి బయోమెకానికల్ కన్సల్టెంట్ అతనికి మార్గనిర్దేశం చేస్తే, అతను తన బౌలింగ్‌కు కొంత వేగాన్ని జోడించవచ్చని కూడా లతీఫ్ తెలిపాడు.

కోచింగ్, ఆటగాడిని మార్చడం అనేవి చాలా కీలకమైన అంశాలని రషీద్ లతీఫ్ తెలిపాడు. సచిన్ స్వయంగా ఆ పని చేయగలడన్నాడు. కానీ దాని కోసం అతను దేశవాళీ క్రికెట్ మీద ఆధారపడ్డాడన్నారు. అర్జున్ బౌలింగ్ బ్యాలెన్స్ బాగోలేదని, అది అతని వేగంపై ప్రభావం చూపుతోందని లతీఫ్ విశ్లేషించాడు. అర్జున్ 135 కిలోమీటర్ల వేగం వరకూ బంతులు విసిరే సామర్ధ్యం ఉందని, మరో రెండు మూడేళ్లలో మంచి బౌలర్ అవుతాడన్నాడు.












Click it and Unblock the Notifications