Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023 : టీవీల్లో భారీగా పెరిగిన మ్యాచ్ వీక్షకులు-గత సీజన్ రికార్డు 29 మ్యాచ్ లకే బద్దలు..

ఐపీఎల్ 2023 సీజన్ ఈసారి భారీ సక్సెస్ అవుతోంది. ఈసారి స్టేడియాలకు తరలివచ్చే ప్రేక్షకుల సంఖ్యతో పాటు జియో సినిమాలో వీక్షిస్తున్న అభిమానుల సంఖ్య కూడా ఇప్పటికే భారీగా ఉంటుండగా.. ఇప్పుడు టీవీల్లోనూ మ్యాచ్ చూస్తున్న వారి సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. ఇది గతేడాది మొత్తం సీజన్ కు వచ్చిన ఆదరణ కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండటంతో టీవీ ప్రసార హక్కులు పొందిన డిస్నీ స్టార్ యాజమాన్యం గాల్లో తేలిపోతోంది.

ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లకు టీవీల్లోనూ భారీ ఆదరణ లభిస్తోంది. గత ఏడాది రికార్డుల్ని అతి తక్కువ సమయంలో, అతి తక్కువ మ్యాచ్ ల్లోనే బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించేందుకు పరుగులు తీస్తోంది. ఈ ఏడాది వేసవి సీజన్లో ఓవైపు ఎండలు మండిపోతుండటం, సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతుండటంతో వీక్షకుల సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత సీజన్ తో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 25 శాతం ఎక్కువ ఆదరణ మ్యాచ్ ల టీవీ ప్రసారాలు దక్కించుకున్నాయి.

tv viewership crosses entire ipl 2022 record in just 29 matches

గత సీజన్ అంటే ఐపీఎల్ 2022 మొత్తానికి నమోదైన టీవీ వీక్షకుల సంఖ్యతో పోలిస్తే ఈసారి తొలి 29 మ్యాచ్ లు చూసిన వారే ఎక్కువగా ఉన్నారంటే ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లకు టీవీల్లో ఆదరణ ఏ స్ధాయిలో పెరిగిందో అర్ధమవుతుంది. గతేడాది ఐపీఎల్ 2022ను మొత్తంగా 400 మిలియన్ల మంది టీవీల్లో వీక్షించారు. అది ఈసారి కేవలం 29 మ్యాచ్ లకే దాటేసి 24 శాతం పెరుగుదల నమోదు చేసుకుందని బార్క్ రేటింగ్స్ చెబుతున్నట్లు డిస్నీ స్టార్ యాజమాన్యం ప్రకటించింది.

ఐపీఎల్‌లోని అన్ని ఎడిషన్లను కలిపి చూస్తే 2 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో వీక్షకుల సంఖ్య 59 శాతం పెరిగిందని డిస్నీ తెలిపింది. టోర్నమెంట్ లైవ్ ను చూడటానికి 93.2 మిలియన్ల మంది పిల్లలు టీవీలకు అతుక్కుపోయినట్లు పేర్కొంది. దేశంలోని 12 నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మార్కెటింగ్, వినూత్న సౌండ్ ప్రోగ్రామింగ్, ఇతరత్రా కారణాల వల్ల వీక్షకుల సంఖ్య భారీగా పెరిగిందని డిస్నీ హెడ్ సంజయ్ గుప్తా చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+