Gujarat Titans : గుజరాత్ టైటాన్స్ లో తమిళ మెరుపులు-సాయి సుదర్శన్, విజయ్ శంకర్ పై ప్రశంసలు
ఢిల్లీ క్యాపిటల్స్ తో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న ఇద్దరు తమిళ క్రికెటర్లు సాయి సుదర్శన్, విజయ్ శంకర్ ఆడిన కీలక ఇన్నింగ్స్ జట్టు విజయానికి కీలకంగా మారింది. సీనియర్ క్రికెటర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అంతా క్యూ కట్టిన వేళ వీళ్లిద్దరూ గుజరాత్ టైటాన్స్ ను తమ ఇన్నింగ్స్ తో విజయ తీరాలకు చేర్చారు. దీనిపై పలువురు వెటరన్ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, సాహా, హార్ధిక పాండ్యా అవుటైన తర్వాత జత కట్టిన సాయి సుదర్శన్, విజయ్ శంకర్.. అద్భుతంగా ఆడారు. ఆచితూచి ఆడుతూనే చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ పరుగులు రాబట్టారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ పర్ ఫెక్ట్ షాట్లతో ఆకట్టుకున్నాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ లోనూ మెరుపు షాట్లతో ఆకట్టుకున్న సాయి సుదర్శన్ ఢిల్లీతో మ్యాచ్ లోనూ కీలకంగా మారిపోయాడు. దీంతో సాయి సుదర్శన్.. విజయ్ శంకర్ తో నెలకొల్పిన భాగస్వామ్యంపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.

గుజరాత్ టైటాన్స్ లో తమిళ బ్యాటర్లు సాయి సుదర్శన్, విజయ్ శంకర్ భాగస్వామ్యంపై జియో సినిమాలో కామెంట్రీ సందర్భంగా స్పందించిన స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. గిల్, సాహా, హార్ధిక్ అవుటైన తర్వాత ఈ తమిళ కుర్రాళ్లు మెరుగైన ప్రదర్శనతో జట్టును నిలబెట్టారని తెలిపాడు. వీరిద్దరి అసాధారణ ప్రదర్శన కారణంగా గుజరాత్ టైటాన్స్ ప్రత్యర్ధుల్ని 160 స్కోరుకు పరిమితం చేసి, గెలుస్తామని నిరూపించుకుందన్నాడు.
అలాగే భారత మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ పార్థివ్ పటేల్ కూడా సుదర్శన్ ఆట తీరు, కాంపాక్ట్ టెక్నిక్ పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సుదర్శన్ వయసు కేవలం 21 సంవత్సరాలని, అతను రెండేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడని పటేల్ తెలిపాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే, చాలా సాంకేతికంగా సరైన ఆటగాడని అనిపిస్తోందన్నాడు. అతను బంతిని స్మాక్ చేయడానికి ప్రయత్నించడని, గత సీజన్‌లో కూడా ఆడటం కలిసొచ్చిందన్నాడు. భవిష్యత్తులో అతనికి మంచి అవకాశాలు దొరుకుతాయని పటేల్ జోస్యం చెప్పాడు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications