IPL 2023 : కొహ్లీ, గంభీర్ కు Sprite చల్లచల్లగా మెసేజ్ పంపిన యువరాజ్ సింగ్...
తాజాగా లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఒకప్పటి టీమిండియా సహచరులు విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్ మధ్య వివాదం తలెత్తింది. మ్యాచ్ ముగిశాక వీరిద్దరూ పరస్పరం ఒకరిపైకి మరొకరు రావడంతో టెన్షన్ నెలకొంది. కాసేపు అదే పరిస్ధితి కొనసాగితే ఇద్దరూ కొట్టుకునే వారే అన్నట్లు కనిపించింది. అయితే సకాలంలో వారి సహచరులు జోక్యం చేసుకుని అదుపు చేయడంతో శాంతించారు. ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు.
లక్నో, బెంగళూరు మ్యాచ్ నేపథ్యంలో కొహ్లీ, గంభీర్ మధ్య చోటు చేసుకున్న వివాదంపై ఒకప్పటి వారి సహచరుడు, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. వీరిద్దరి మధ్య వివాదాన్ని శాంతింపచేసేలా ఓ కూల్ మెసేజ్ పంపాడు. మధ్యలో శీతలపానీయం SPRITE ను కూడా తీసుకొచ్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ఇందులో కొహ్లీ, గంభీర్ ఇద్దరికీ ఓ సూచన చేశాడు. అదే సమయంలో వీరిద్దరితో ఓ ఒప్పందం కూడా చేసుకోవాలని సదరు శీతలపానీయ సంస్ధకూ సూచించాడు.

కొహ్లీ, గంభీర్ మధ్య వివాదం చల్లారాలంటే శీతల పానీయాల సంస్ధ SPRITE వీరిద్దరితో ఓ ఒప్పందం చేసుకోవాలని యువరాజ్ సింగ్ సరదాగా సూచించాడు. గౌతీ, చీకూ పేరుతో ఉన్న గంభీర్, కొహ్లీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఇందులో యువీ ట్యాగ్ చేశాడు. SPRITE ట్యాగ్ లైన్ అయిన థండ్ రఖ్ (చల్లగా ఉంచు)ను కూడా ఇందులో చేర్చాడు. చివర్లో ఏమంటారు గయ్స్ అంటూ ఇద్దరినీ అడిగాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
కొహ్లీ, గంభీర్ లను శాంతింపజేసేందుకు యువీ పెట్టిన ట్వీట్ పై అభిమానులు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. యువీ గొప్ప ఐడియా ఇచ్చాడని, ఆ ఇద్దరు ఫేమస్ ఆటగాళ్లతో స్ప్రైట్ ఒప్పదం చేసుకోవాలని కొందరు, అలా చేస్తే ఆ యాడ్ చాలా పాపులర్ అవుతుందని, వీరిద్దరూ కలిసిపోతారని మరికొందరు, నువ్వు కూడా గతంలో గొడవ పడ్డ ఇంగ్లండ్ ఆటగాడు ఫ్లింటాప్ తో ఒప్పందం చేసుకో అని ఇంకొందరు ట్వీట్లు పెడుతున్నారు. స్ప్రైట్ యాడ్ కు ఎలాగో ఇద్దరు కావాలని, వీరిద్దరితో ఒప్పందం చేసుకుంటే యాడ్ పాపులర్ అవుతుందని మరికొందరు సలహా ఇస్తున్నారు.
I think #Sprite should sign #Gauti and #Cheeku for their campaign #ThandRakh 🤪🥶 what say guys? 😎 @GautamGambhir @imVkohli @Sprite
— Yuvraj Singh (@YUVSTRONG12) May 4, 2023












Click it and Unblock the Notifications