viral video:సాయి శ్రీయ డ్యాన్స్ అదిరింది.. నెటిజన్ల నీరాజనం.. బ్లెస్సింగ్స్ కూడా..
పెళ్లి అంటే సరదా, సంబురాం, సంతోషం.. అయితే తెలంగాణలో ఓ వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. జగిత్యాల జిల్లా ధర్మారంకు చెందిన సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ ఓ పాటకు చిందులేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చక్కగా డ్యాన్స్ చేసిన వధువు
పాట తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. ఆ పాటకు వధువు చక్కగా డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట పెళ్లి కూతురు స్వయంగా పాట పాడి డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్‌ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తను కూడా కాలు కదిపాడు. వధువుతో కలిసి డాన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయాడు. ఆ వధువు మాత్రం దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఆ పాటకు డాన్స్ చేస్తూనే ఉంది. వదువు డాన్స్‌ను వరుడు తాపీగా నిలబడి ఎంజాయ్ చేయసాగాడు. చివర్లో బంధువులు, స్నేహితులు కూడా వధువుతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా..
నా కాబోయే శ్రీవారూ, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పద అంటూ సరదాగా మొదలయ్యే ఆ పాటలో ఎక్కువగా వధువు గురించే ఉంది. అల్లారుముద్దుగా పెరిగినట్టు, తనను ఎక్కువగా గారాబం చేసి పెంచినట్టుగా వరుడితో వధువు చెప్పుకుంటోంది. పువ్వులా పెరిగాను అయినా నీ చేయి పట్టుకోవడానికి వస్తున్నా అంటూ ఆ పాట సాగుతుంది. మీ అమ్మానాన్నల్ని మా అమ్మానాన్నల్లాగే చూసుకుంటా అంటూ బంధాల గురించి ఆ పాటలో చరణాలు ఉన్నాయి. అందుకే నెట్టింట యూత్‌కు తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డ్యాన్స్ అదిరింది..
సాయి శ్రీయ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత పేరు, వివరాలు తెలియడంతో ప్రతీ ఒక్కరూ దానినే షేర్ చేస్తున్నారు. అందరూ ఆశీర్వాదం కూడా అందజేస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా బతుకు అంటూ బ్లెస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట కరోనా సమయంలో లక్షలాది మంది నుంచి మనస్పూర్తిగా బ్లెస్సింగ్ తీసుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications