12 మంది మృతి.. కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సులు.. ఎక్కడ అంటే (వీడియో)

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అనంతపురం, కడపలో ప్రభావం ఎక్కువగానే ఉంది. వర్షాలు, వరదలతో ఆ ప్రాంత ప్రజల పరిస్థితి వర్ణణాతీతం. భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం జరిగింది. నందలూరు పరివాహక ప్రాంతంలో గల మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకుని సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారు.

ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. గండ్లూరులో 7, రాయవరంలో 3, మండపల్లిలో 2 మృతదేహాలు లభించాయి. రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తుతోంది.

12 people dead in rajampet bus sinking incident

చెయ్యేరు నది పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నందలూరు వద్ద 30 మంది వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.

వర్షాల వల్ల పంటలకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంట చేలలో వరి మునగడంతో కొన్ని చోట్ల రైతుల బాధ వర్ణణాతీతంగా మారింది. వారు విలపిస్తోన్న దృశ్యాలు సాటి వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల వరి కోయలేదు. మరికొన్ని చోట్ల పంట కోసి.. మార్కెట్‌కు తరలించారు. విక్రయం కాకపోవడం.. వర్షం కురవడంతో వారి బాధ గురించి చెప్పలేం. రోజుకో కారణం చెప్పి.. మ్యాచర్ రావడం లేదు. వరి అయితే 17 తేమ శాతం వస్తే.. ఓకే.. లేదంటే వాటిని కొనుగోలు చేయరు. సో అలా అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను గద్దలా వరుణ దేవుడు తీవ్రంగా దెబ్బతీస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+