కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 వేల మంది చేరిక.. టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

|
Google Oneindia TeluguNews

హుజూరాబాద్ నియోజకవర్గంలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో నియోజకవర్గానికి చెందిన దళిత యువ నాయకులు 2,000 మంది.. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో‌ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

 అందుకే చేరిక

అందుకే చేరిక

దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ, ఈటల రాజేందర్ గురించి తెలిసే పెద్ద సంఖ్యలో యువకులు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క అంబేద్కర్ భవనాన్ని కూడా ఈటల రాజేందర్ కట్టించలేదని చెప్పారు. దళితుల ఉన్నతికి సీఎం కేసీఆర్ గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులపై దాడులు నిత్యం జరుగుతుంటాయని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దళితబంధు లాంటి మహత్తర పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 నిజాన్ని గ్రహించి..

నిజాన్ని గ్రహించి..

ఈ రోజు మీరు నిజాన్ని గ్రహించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ దళితుల పేదరికాన్ని పారదోలేందుకు ధైర్యం చేసి ఈ గొప్ప పథకాన్ని తెచ్చారని వివరించారు. కాళ్ల చెప్పులు అరిగినా లోన్లు వచ్చేవి కావన్నారు. కానీ ఇప్పుడు దరఖాస్తులు పెట్టేది లేదు, ఆఫీసుల చుట్టూ తిరిగేది లేదు, పైరవీలు లేవు, వాయిదాలు కట్టేది, తిరిగి చెల్లించేది లేదు. మీకు పడుతున్న డబ్బుల్ని సద్వినియోగం చేసుకోండి. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. నలుగురిని బతికించే విధంగా, ఐదుగురికి ఉద్యోగాలిచ్చే విధంగా గొప్పగా ఎదగాలి. తొందరపడి ఏ నిర్ణయాలు వద్దు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Recommended Video

Afghanistan తాలిబన్ల పాలన.. Mullah Baradar పై India ఆశలు, పాకిస్తాన్ పై ఒత్తిడి || Oneindia Telugu
 అక్కడ కూడా..

అక్కడ కూడా..

పాడి, పాల ఉత్పత్తి పనులపై దృష్టిసారించాలని ఆయన కోరారు. కరీంనగర్, వరంగల్, హన్మకొండల్లో కూడా మీరు షాపులు పెట్టుకోవచ్చు. వైన్, మెడికల్ షాపులు కూడా పెట్టుకోవచ్చు. కాంట్రాక్టు పనులు కూడా చేయొచ్చు. కెసిఆర్ ఈ పనుల్లో కూడా రిజర్వేషన్లు తీసుకువస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బాగా పని చేసి 100% విజయం సాధించాలి అని ఆశించారు. దేశానికి హూజూరాబాద్ దిక్సూచిగా మారాలని, చీడ పురుగులను ఏరి పారేయాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రజలకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు.

English summary
2 thousand workers join to trs party in front of minister harish rao and koppula eshwar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X