కూతురుకు మాయమాటలు.. నెల రోజుల మనవరాలిని రూ. లక్షా 10వేలకు అమ్మేసిన అమ్మమ్మ
కరీంనగర్: జిల్లాలోని వీణవంక మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన అప్పులు తీర్చేందుకు ఏకంగా సొంత మనవరాలినే అమ్ముకుంది. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు అందడంతో వెంటనే రంగంలోకి దిగారు. నిందితులందర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అప్పులు కట్టేందుకు..
వివరాల్లోకి వెళితే.. వీణవంక మండల కేంద్రానికి చెందిన మోతే పద్మ, రమేష్‌ల కూతురును ఆమె అమ్మమ్మ సరిగిరి కనుకమ్మ అప్పులు కట్టుకునేందుకు అమ్మకానికి పెట్టింది. రూ. లక్షా 10వేలకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి 4 రోజుల క్రితం అమ్మేసింది. పద్మ, రమేష్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం పద్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది.

కూతురుకు మాయమాటలు చెప్పి..
ఇటీవల రమేష్-పద్మ మధ్య గొడవలు జరగింది. దీంతో వారం రోజుల క్రితం పద్మ తన కూతురును తీసుకుని వీణవంక గ్రామంలోని తన తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది. కాగా, పద్మకు ఇంతకుముందే వివాహం జరిగగా, మొదటి భర్తతో ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత రమేష్‌ను పద్మ ప్రేమ వివాహం చేసుకుంది. మొదటి నుంచి తల్లికి మరో కులం వ్యక్తిని పద్మ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ క్రమంలో తిరిగి తన వద్దకు వచ్చిన పద్మను మాయమాటలతో ఒప్పించి పలు కాగితాలపైసంతకాలు చేయించింది కనకమ్మ.
Recommended Video

నెల రోజుల శిశువును అమ్మేసి.. తాత ఫిర్యాదుతో..
ఆ తర్వాత నెలరోజుల క్రితం పుట్టిన ఆఢశిశివును గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి అమ్మేసింది. దీని ద్వారా వచ్చిన డబ్బులతో తన అప్పులను తీర్చేసింది కనకమ్మ. ఇదే విషయం కూతురుకు కూడా చెప్పింది. కాగా, తన కూతురు పద్మకు పుట్టిన ఆడపిల్లను అమ్ముకున్నారని తెలియడంతో ఆమె తండ్రి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కనకమ్మ, ఆమెకు సహకరించినవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications