కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబ్బులు డిమాండ్: మంత్రి గంగుల పీఆర్వో మల్లికార్జున్, నెలరోజులు కాకముందే చేతివాటం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పీఆర్వో బోనాల మల్లికార్జున్‌పై డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆడియో కూడా వైరల్ అవుతుంది. ఒకతనిని మల్లికార్జున్ డబ్బులు అడిగిన ఆడియో స్పష్టంగా వినిపిస్తోంది. అయితే అతను పీఆర్వోగా ఇటీవలే చేరాడు. కనీసం నెలరోజులు కూడా కావడం లేదు. అప్పుడే తన చేతివాటాన్ని చూపించాడు. దీంతో అతనిని మంత్రి విధుల నుంచి తొలగించారు. జిల్లాలో ఈ ఘటన కలకలం రేగింది.

డ‌బ్బులు డిమాండ్ చేసిన ఆడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీంతో మంత్రి పీఆర్వో ఆడియోపై పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు. డబ్బులు డిమాండ్ చేసిన బోనాల మ‌ల్లికార్జున్‌పై మంత్రి గంగుల సీరియస్ అయ్యారు. వెంటనే మల్లికార్జున్‌ను విధుల నుంచి తొలగించారు. స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని వాటర్ ప్లాంట్ యజమాని వద్ద బోనాల మ‌ల్లికార్జున్ డబ్బులు డిమాండ్ చేశారు. సీఐ, ఏసీపీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అందులో చెప్పినట్టు వినిపిస్తోంది.

minister gangula PRO asked to bribe someone for station bail

ఆడియోలో పోలీసుల ప్రస్తావన కూడా ఉంది. దీంతో జిల్లా పోలీసు అధికారులను అదనపు డీజీపీ నాగిరెడ్డి వివరణ కోరారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. డీసీపీ నేతృత్వంలో విచారణ జరగనుంది. కానీ డబ్బులు డిమాండ్ చేశారనే విషయం మంత్రికి చెడ్డ పేరు వచ్చింది. అందుకే వెంటనే అతనిని విధుల నుంచి తప్పించారు.

కేసీఆర్ మంత్రివర్గంలో గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ చూస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్నారు. ఇంతలో అతని పీఆర్వోపై ఆరోపణలు రావడం కలకలం రేగింది. మరీ దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలీ.

English summary
Telangana minister gangula kamalakar PRO asked bribe someone for station bail. audio leaked in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X