Crime News: ఖమ్మం జిల్లాలో దారుణం.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ప్రాణం పోయింది..
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ముదిగొండ మండలం బాణాపురంలో ఓ వ్యక్తి మరో వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడు. వలభి సమీపంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిఫ్ట్ అడగాడు. మనవాత దృక్పథంపో అతను లిఫ్ట్ ఇచ్చాడు.కొంతదూరం వెళ్లాక నిందితుడు వాహనదారుడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో వాహనదారుడు వెంటనే స్పృహ తప్పిపోయాడు.
ఆ తర్వాత దుండగుడు ఆ బైక్‌తో పరారయ్యాడు. పడి ఉన్న వ్యక్తి చూసిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు చింతకాని మండల వాసి జమాల్ సాహెబ్ (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

దుండగుడు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టిస్తున్నది.












Click it and Unblock the Notifications