చంద్రబాబుపై పోటీ చేయడం లేదు, మరీ రూమర్లు ఎలా..? : విశాల్ వెర్షన్ ఇదీ..
కుప్పం.. చంద్రబాబు నాయుడు కంచుకోట.. అక్కడి నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నటుడు విశాల్ అని తెగ ప్రచారం జరిగింది. దీనిని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. కానీ రూమర్లు సర్క్యులేట్ కావడంతో.. నటుడు విశాల్ స్పందించాల్సి వచ్చింది. తనేం పోటీ చేయడం లేదే అని ట్వీట్ చేశారు. దీంతో ఊహాగానాలకు తెరపడినట్టు అయ్యింది.

చంద్రబాబుపై పోటీ..?
వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబుపై వైసీపీ అభ్యర్థిగా తమిళ నటుడు విశాల్ పోటీ చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. ఇప్పుడు నటుడు విశాల్ వంతు వచ్చింది. అబ్బే తాను పోటీ చేయడమా..? అని సందేహాం వ్యక్తం చేశారు. అదేం లేదు అని కామెంట్ చేశారు.

అదేం లేదు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి త్వరలో ఎంట్రీ ఇస్తున్నాననే వార్తల్లో నిజం లేదని చెప్పారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీకి దిగుతున్నాననే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టంచేశారు. దీని గురించి తనకు అసలే తెలియదని పేర్కొన్నారు. ఇప్పటివరకు తనను ఎవరూ సంప్రదించలేదని కూడా వివరించారు. అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తనకు తెలియదన్నారు. విశాల్ ప్రకటనతో పోటీ లేదని క్లారిటీ వచ్చింది.

సినిమాలపై ఫోకస్
తన దృష్టి మొత్తం సినిమాలపై ఉందని విశాల్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని తేల్చిచెప్పారు. దీంతో గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టు అయ్యింది. కానీ నిప్పు లేనిది పొగ రాదు కదా అనేవారు కూడా ఉన్నారు. ఊరికే ఎలా విషయం బయటకు వస్తోంది అని కొందరు అంటున్నారు. ఎన్నికలకు సమయం ఉన్నందున.. ఇప్పుడే ఏదో జరగబోతుందని ఊహించుకోవడంతో ప్రయోజనం ఏమీ లేదనే వారు కొందరు ఉన్నారు. ఇప్పటినుంచి హింట్ ఇస్తేనే కదా.. క్షేత్రస్థాయిలో శ్రేణులు వర్క్ చేసేది అని మరికొందరు అంటున్నారు. కానీ విశాల్ పొలిటికల్ ఎంట్రీపై మాత్రం హాట్ హాట్‌గా చర్చ జరిగింది.
— Vishal (@VishalKOfficial) July 1, 2022












Click it and Unblock the Notifications