Crime News: కర్నూలులో దారుణం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు..
వారం రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆమోస్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గోనెగండ్ల మండలం ఆల్వాల్ గ్రామానికి చెందిన ఆమోస్ అదే గ్రామానికి చెందిన అరుణ అనే యువతిని 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని యువతి తండ్రి నిరాకరించడంతో గ్రామం నుంచి వచ్చేసి కర్నూలులో నివాసం ఉంటున్నారు. ఓ షాపింగ్ మాల్ లో వీరిద్దరూ కలిసి పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరికి అఖిల్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.

కనిపించకుండా పోయాడు
ఉన్నట్టుండి అమౌస్ కనిపించకుండా పోయాడు. భర్త కనిపియడం లేదు అన్న విషయాన్ని అమౌస్ తండ్రి చిన్న నరసన్నకి అరుణ ఫోన్ చేసి చెప్పింది. దీంతో వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతలో ఆమోస్ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అరుణ కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను గుర్తించారు.

సూర్య ప్రదీప్
అరుణతోపాటు ఆమె ప్రియుడు ములకల సూర్య ప్రదీప్, జీవన్‌కుమార్‌లను అరెస్టు చేశారు. కర్నూలులోని కార్యాలయంలో డీఎస్పీ కె.వి.మహేష్‌కుమార్, సీఐ శంకరయ్య బుధవారం వివరాలు వెల్లడించారు. ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా.. కాంప్లెక్స్‌లోని వస్త్ర దుకాణంలో అరుణ సేల్స్‌గర్ల్‌గా పనిచేసే క్రమంలో ఆమోస్ మద్యానికి బానిసయ్యాడు. తాగడమే కాకుండా అరుణను వేధించేవాడు.

తాగొచ్చి కొట్టడంతో
ఈ క్రమంలో వీరి ఇంటి సమీపంలో ఉండే ములకల సూర్యప్రదీప్‌తో కలిసి ఆమోస్ మద్యం తాగేవాడు. ఈ నేపథ్యంలో అరుణకు సూర్యప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. భర్త తాగొచ్చి కొట్టడంతో సూర్యప్రదీప్ కు అరుణ మరింత దగ్గరయింది. ఈ క్రమంలో అరుణ తన భర్తను చంపితే నిన్ను పెళ్లి చేసుకుంటానని సూర్యప్రదీప్‌తో చెప్పింది.

మద్యం తాగించి
సూర్యప్రదీప్ ఆమోస్ ను చంపడానికి తన స్నేహితుడు జీవన్‌కుమార్‌తో కలిసి పథక రచన చేశాడు. డిసెంబర్ 22న మద్యం తాగుదాం రమ్మని సూర్యప్రదీప్, జీవన్‌కుమార్... ఆమోస్‌ను బయటకు తీసుకెళ్లారు. అతనికి మద్యం తాగించారు. ఆమెస్ బాగా తాగిన తర్వాత రాడ్డుతో బలంగా కొట్టి చంపేశారు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications