Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రాలయంలో 108 ఫీట్ల భారీ శ్రీరాముడి విగ్రహం: అమిత్ షా ఏమన్నారంటే?

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం.. 108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం ఏర్పాటుతో ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శివారులోదాదాపు రూ. 300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి వర్చువల్ విధానంలో అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని అమిత్ షా వ్యాఖ్యానించారు. శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, జైశ్రీరామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్, మంత్రి గుమ్మనూరు జయరాం, బీజేపీ నేత టీజీ వెంకటేశ్, భారీ సంఖ్యలో గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణం జరగనుంది.

Union Minister Amit Shah lays the foundation stone of 108 feet tall statue of Lord Shri Ram in Mantralayam, Kurnool

గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ వాంజీ సుతార్‌కు శ్రీరాముని విగ్రహ రూపకల్పన బాధ్యతను అప్పగించారు. విగ్రహ నమూనాను ఆయన ప్రాథమికంగా ఖరారు చేశారు. ఆ నమూనా ఆధారంగా రూపొందించిన చిన్న విగ్రహంతో నేడు శంకుస్థాపన చేశారు. ఇక రెండేళ్ల సమయంలో 108 ఫీట్ల పంచలోహ విగ్రహం తయారు చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అంతేగాక, ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు.

మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటర్ దూరంలో 10 ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం జరగనుంది. పూర్తిస్థాయి రాతి కట్టడంలా ఈ రామాలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆలయ ఆకృతుల రూపకల్పనల్లో ప్రముఖుడైన డాక్టర్ ఎ వేలుకు ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.

Union Minister Amit Shah lays the foundation stone of 108 feet tall statue of Lord Shri Ram in Mantralayam, Kurnool

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, కాశీలోని విశ్వనాథ ఆలయం, సింహాచలంలోని నరసింహస్వామి, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయం, బాసర జ్ఞానసరస్వతి ఆలయం, కర్ణాటక చెలువ నారాయణస్వామి ఆలయం, తమిళనాడు మూషణం వరాహస్వామి ఆలయం, మహారాష్ట్రలోని విరోభా రుక్మిణి ఆలయాలను తలపించే చిన్నపాటి ఆలయాలనూ ఈ పది ఎకరాల స్థలంలోనే నిర్మించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+