EMK:బాబాయ్‌తో బంధానికి మాటల్లేవ్: నాన్న ఎప్పుడూ ఆచార్యే: చరణ్ ఎమోషనల్..తారక్‌తో రివీల్..!!
రామ్ వర్సెస్ రామ్...వెండితెరపై కాదు.. బుల్లి తెరపైన కూడా.RRR హీరోలు సండే రోజు సందడి చేశారు. రాఖీ పండగా అందునా.. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కావటంతో రాంచరణ్ బుల్లితెరపైకి వచ్చారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభించిన ఎవరు మీలో కోటీశ్వరులులో గెస్ట్‌గా హాట్ సీట్‌పై కూర్చున్న రాంచరణ్ అనేక విషయాలు షేర్ చేసుకున్నారు. కర్టన్ రైజర్ షోను అదుర్స్ అనిపించారు. రాంచరణ్‌ను పరిచయం చేస్తూనే మిస్టర్ కూల్ సంస్కారవంతుడు అంటూ తారక్ ఆకాశానికెత్తేశాడు. షోలో పాల్గొన్న సెలబ్రిటీలు గెల్చుకున్న మొత్తం డబ్బులను ఛారిటీకి ఇవ్వాలన్నది కండీషన్‌గా తారక్ చెప్పగానే చరణ్ కొత్త విషయాన్ని వెల్లడించారు. 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌లో ఇప్పటి వరకు రూపాయి కూడా కమీషన్ తీసుకోలేదని చెప్పారు. తమ కొచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సీసీటీ కోసం పక్కనపెట్టి భవిష్యత్ సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించామని చెప్పారు.

ఫోటోగ్రఫీ పై రాంచరణ్..
మరో ప్రశ్నకు సమాధానంగా తనకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమని.. తాజాగా ఆఫ్రికా అడవుల్లో అంతకంటే ఇష్టమైన జంతువుల ఫోటోలను తీసినట్లు రాంచరణ్ చెప్పారు. ఆ ఫోటోలు తాను చూశానని అద్భుతంగా వచ్చాయంటూ తారక్ ప్రశంసించారు. అదే సమయంలో చరణ్ కూడా తారక్‌కు జంతువులంటే చాలా ఇష్టమనే విషయాన్ని బయటపెట్టాడు. హైదరాబాదులోనే ఎవరి దగ్గర లేని కుక్కను ఒకటి పెంచుకునేవాడని రాంచరణ్ చెప్పగా.. తారక్ అది చనిపోయిన తర్వాత ఇక కుక్కల జోలికి వెళ్లలేదని చెబుతూ ఎమోషన్ అయ్యారు. దీనికి కొనసాగింపుగా రాంచరణ్ హార్స్ రైడర్ అనే విషయం తెలిసినా అతని దగ్గర ఉండే గుర్రాల సంగతి అతితక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ షో ద్వారా తన దగ్గరున్న గుర్రాల పేర్లను చరణ్ బయటపెట్టారు. రెండు గుర్రాలు మగధీర చిత్రంలో కనిపిస్తాయని చెప్పారు. వాటిపేర్లు బాద్షా, మరొక గుర్రంపేరు కాజల్‌గా చెప్పుకొచ్చారు.

బాబాయ్‌తో రిలేషన్‌షిప్ స్పెషల్
మరో ప్రశ్నలో భాగంగా జానీ మూవీలో పవన్ కళ్యాణ్ పాడిన పాట ఆడియో క్లిప్‌ను వినిపించగా చరణ్ ఒకరకంగా తన బాబాయ్ గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు. తన బాబాయ్‌తో ఉన్న బాండింగ్ మాటల్లో చెప్పలేనిదన్నారు. తనను చిన్నప్పటి నుంచి చిన్నాన్నలాగానే తండ్రి స్థానంలో ఉండి అన్ని చూశాడంటూ వివరించాడు. తమ చదువుల దగ్గర నుంచి వ్యక్తిగత విషయాల వరకు అన్నీ కళ్యాణ్ బాబాయే చూశాడని ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తనతో చెప్పలేని విషయాలను కళ్యాణ్ బాబాయ్‌తో చెప్పించేవాడని గుర్తు చేసుకున్నాడు. ఇది విన్న తారక్ వీరిద్దరి మధ్య ఈ బంధం ఇలానే బలంగా కంటిన్యూ అవ్వాలంటూ ఆకాంక్షించారు.

కొరటాలకు స్పెషల్ థ్యాంక్స్
తారక్ తనముందున్న కంప్యూటర్‌ను గురువుగారు అని సంబోధించడం పైన చరణ్ సెటైరికల్‌గా స్పందించారు. గురువుగారు గురువుగారు అంటుంటే అదుర్స్ మూవీలో బ్రహ్మానందంతో జూనియర్ పండించిన కామెడీ సీన్స్ గుర్తుకొస్తుంటాయని చరణ్ చెప్పాడు. వీవీ వినాయక్-తారక్ కాంబోలో వచ్చిన చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కితాబిచ్చాడు. ఆచార్య సినిమా గురించి మరికొన్ని విషయాలను చరణ్ బయటపెట్టాడు. కొరటాల శివ తొలుత తనకు 15 నిమిషాల క్యారెక్టర్ మాత్రమే ఖరారు చేశాడని ఆ తర్వాత దాన్ని ఫుల్ లెంగ్త్ రోల్‌గా మలచాడని చరణ్ వివరించాడు. తన తండ్రితో కలిసి సినిమా చేయడమంటే ప్రిన్సిపల్ ముందు కూర్చొని పరీక్ష రాసినట్లుగా ఉంటుందని చరణ్ పేర్కొన్నాడు. అయినా తన తండ్రి ఇప్పటికీ ఎప్పటికీ ఆచార్యేనని చెప్పుకొచ్చారు. దీనికి తారక్ సైతం స్పందిస్తూ ఫీల్డ్‌లో ఉన్న తనలాంటి వారికెందరికో చిరంజీవి స్ఫూర్తిదాయకమన్నారు.

జక్కన్న సర్ప్రైజ్
ఇక షోలో భాగంగా రాంచరణ్ సంగీత అభిరుచి గురించి ప్రస్తావనకు వచ్చింది. రాంచరణ్ పాట పాడుతారని తారక్ ప్రేక్షకుల ముందు ఫిక్స్ చేసేశాడు. దీంతో తాను చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నట్లు తారక్ కూడా తనతో పాటు గొంతుకలపాలని కండీషన్ పెడతారు. దీంతో తారక్ కూడా ఓకే చెప్పేయడంతో ఇద్దరూ కలిసి ఆరెంజ్ మూవీలోని సిడ్నీ నగరం పాట పాడారు. ఇది షోలో హైలైట్‌గా నిలిచింది. ఇక తన సతీమణి ఉపాసనకు జంతువులంటే చాలా ఇష్టమని పెటాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. ఇక చివరిగా కొమురం భీం జిల్లాకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. దీంతో టాపిక్ RRR మూవీ వైపు మళ్లింది. తారక్ చేస్తున్న కొమురం భీం పాత్ర చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటుందని చిన్న లీక్ ఇచ్చాడు చరణ్. అయితే ఈ సినిమాలో జక్కన్న చాలా సర్ప్‌రైజ్‌లను ప్లాన్ చేశాడంటూ ఇద్దరే చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళికి థ్యాంక్స్ చెప్పారు.
Recommended Video

జక్కన్న పై సెటైర్లు
దీనికి కొనసాగింపుగా రెండో సోమవారం ప్రసారం కానుంది. అందులో ఒకే మూవీని మూడేళ్లుగా తీస్తున్న జక్కన్నపై సెటైర్లు, వీడియోలైవ్‌లో రానా ఎంట్రీతో ముగ్గురి మధ్య జోకులు, పంచులు పేలనున్నాయి. దీంతో కర్టన్ రైజర్ సెకండ్ పార్ట్ పైన మరింత ఆసక్తి పెరుగుతోంది. ఎవరు మీలో కోటీశ్వరులు రియాల్టీ షో జెమిని టీవీలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ప్రసారం కానుంది. ఆట మీది కోటి మాది అనే పంచ్‌తో షో రక్తికట్టనుంది. మరో రెండు వారాల్లో ఎవరు మీలో కోటీశ్వరులకు పోటీగా బిగ్‌బాస్ సీజన్ -5 ప్రారంభం కానుంది. ఈ రెండు రియాల్టీ షోలతో తెలుగు ఆడియెన్స్‌కు మస్తు మజా అందనుంది.












Click it and Unblock the Notifications