MI Vs GT : అర్జున్ టెండూల్కర్ కు షాక్ ! గుజరాత్ తో పోరులో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఛాన్స్ ?
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఇరుజట్లూ పలు కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ సీజన్ లో అరంగేట్రం చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ ను తప్పించేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ స్ధానంలో మరో లెఫ్ట్ ఆర్మ పేసర్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తలపడబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ఇరుజట్లకూ కీలకంగా మారింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు మూడు మ్యాచ్ ల గెలుపు తర్వాత ముంబైలో పంజాబ్ చేతిలో తమ చివరి గేమ్‌ను కోల్పోయింది. ఈ సీజన్‌లో ముంబై ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచింది.

ముంబై తమ ఆరంభ మ్యాచ్ ల్లో ఆర్సీబీ, చెన్నై చేతిలో ఓడిపోయింది కానీ డీసీ, కేకేఆర్, హైదరాబాద్ పై వరుసగా మూడు విజయాలతో పుంజుకుంది. వాంఖడే స్టేడియంలో మాత్రం 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. ఈ తరుణంలో ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ తో పోరులో నీహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్ లేదా సందీప్ వారియర్ ఇంపాక్ట్ ప్లేయర్ రేసులో ఉన్నారు. బ్యాటర్లు ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన తరుణంలో వారితో పాటు బౌలర్లు కూడా రాణించాలని ముంబై కోరుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ గుజరాత్ లో జరిగే పోరులో అర్జున్ టెండూల్కర్ కు ప్లేస్ గ్యారంటీ లేదని తేలిపోయింది. అయితే పరిస్ధితిని బట్టి తీసుకునే ఇంపాక్ట్ ప్లేయర్ రేసులో ఉండటం మాత్రమే అర్జున్ కు ఊరటగా కనిపిస్తోంది. దీంతో అర్జున్ టెండూల్కర్ కు అవకాశం దక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications