నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

59.92 పోలింగ్ నమోదు: 95 శాతం పోలయ్యే ఛాన్స్, మొబైల్స్‌కు నో పర్మిషన్

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్.. పోలింగ్ జరుగుతుంది. వయోజనుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఓటు వేసేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 పోలింగ్ నమోదైంది. ఓటు వేసేందుకు మరో 3 గంటల సమయం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది.

7 మండల కేంద్రాల్లో పోలింగ్ స్లోగా జరిగినట్టు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓటర్లు.. ఎక్కువ శాతం హైదరాబాద్.. పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ జాబ్స్ చేస్తారు. అందుకే వారంతా ఇప్పుడిప్పుడు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. 95 శాతం వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటు వేసేందుకు భారీగా జనం ఉన్నారు.

59.92 percentage polling in 3pm at munugodu by poll

ఇప్పటివరకు లక్ష 44 వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 3 గంటలు దాటితే ఆ సంఖ్య మరింత పెరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. వయోజనులను మొబైల్ ఫోన్స్ తీసుకురావడానికి అనుమతి ఇవ్వలేదు. ఇదివరకు పోలింగ్ కేంద్రం వద్ద ఫోటోలు/ వీడియో తీసి షేర్ చేయడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. ఈ నెల 6వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. అదేరోజు ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇప్పటివరకు అయితే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ కనిపించింది.

English summary
59.92 percentage polling in 3pm at munugodu by poll. people are queue in line at polling booth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X