నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊసరవెల్లి నయం.. మోసం, నయవంచనే.. కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ తప్పులను ఆమె ఎండగడుతున్నారు. కేసీఆర్ రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రజాప్రస్థానంలో భాగంగా 42వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండ‌లం కొత్త‌ప‌ల్లి గ్రామంలో పాద‌యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి జాజిరెడ్డిగూడెం మండ‌లం భాగ్య‌న‌గ‌ర్, పర్సాయిప‌ల్లి, అర్వ‌ప‌ల్లి, గోపాల‌పురం, ప‌ట‌మ‌టి తండా, కాస‌ర్లప‌హాడ్ , తూర్పు తండా మీదుగా సాగింది. సాయంత్రం కొమ్మాల గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు

పూటకో మాట..

పూటకో మాట..


వడ్ల కొనుగోళ్ల అంశంపై కేసీఆర్ ఊసరవెల్లిలా మాటలు మారుస్తున్నారని విమర్శించారు. ఓ సారి సన్నొడ్లు వేయాలని చెప్పి, రైతులకు నష్టం వచ్చేలా చేశారు. మరోసారి చివరి గింజ వరకు కొంటామని చెప్పి, కొనకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఇప్పుడేమో వడ్లు కొనమని, కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తున్నట్లు చెబుతున్నారు. వడ్ల కొనుగోళ్ల చేయకపోవడానికి కారణం కేంద్రమేనని చెప్పి, ఢిల్లీ రాజకీయాలు మొదలుపెడుతున్నారు. వడ్లు కొనమని చెప్పిన కేసీఆర్.. రూ.లక్షల కోట్ల ప్రజాధనంతో ప్రాజెక్టులు ఎందుకు కట్టారో సమాధనం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర ఉన్న పంట వేసుకోవడం రైతు హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం కేసీఆర్ కు లేదన్నారు.

చివరి గింజ.. కొంటారా.. కొనరా

చివరి గింజ.. కొంటారా.. కొనరా


రైతులు పండించిన చివరి గింజ వరకూ కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. మీరు రా రైస్ చేసుకుంటారో బాయిల్డ్ రైస్ చేసుకుంటారో మీ ఇష్టం. రైతులు పండించిన వడ్లను కొనాల్సిందే. ఎనిమిదేళ్లలో కేసీఆర్ రైతులకు చేసిందేమీ లేదు. ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెబుతున్న కేసీఆర్.. ఆనాడే వైయస్ఆర్ ఉచిత విద్యుత్ అందించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రూ.5వేల రైతుబంధు ఇస్తూ.. రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టాడు. సబ్సిడీ విత్తనాలు లేవు. ఇన్ పుడ్ సబ్సిడీ లేదు. రైతు రుణమాఫీ లేదు. పంట నష్టపరిహారం లేదు. కేసీఆర్ ముమ్మాటికీ రైతు ద్రోహే. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే అక్రమ ఇసుక దందాలో ఆరితేరారు. తోడేళ్లలా ఇసుక తోడుతూ నియోజకవర్గాన్ని ఎడారిలా మారుస్తున్నారు.

 మోసం.. వంచన

మోసం.. వంచన


కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. పూర్తి రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని మోసం చేశారు. దళితబంధు ఇస్తానని మోసం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలనూ మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగమని యువతను మోసం చేశారు. నెలకు రూ.3016 నిరుద్యోగు భృతి అని నిరుద్యోగులనూ మోసం చేశారు. నేడు నిత్యావసర రేట్లు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. ఓ వైపు ఉచిత కరెంట్ అంటూనే మరోవైపు కరెంట్ చార్జీలు పెంచాడు. ఏడాదిలో రెండు సార్లు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి, సామాన్యులు ఇండ్లు, భూముల జాగలు కొనుక్కోలేని స్థితికి తీసుకొచ్చారు. ఇవాళ పాదయాత్రలో తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జి ఏపూరి సోమన్న, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, బి. సత్యవతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నీలం రమేష్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ ఇంజం నర్సిరెడ్డి, హుజుర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అదెర్ల శ్రీనివాస్ రెడ్డి, మాట ముచ్చట కోఆర్డినేటర్ చైతన్య రెడ్డి, సూర్యాపేట జిల్లా నాయకులు బీరవెల్లి శ్రీనివాస్ రెడ్డి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

English summary
telangana cm kcr is a cheater ysrtp chief ys sharmila said in praja prastana padayatra at nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X