ఇది నకిలీ లేడీ రైల్వే పోలీస్ స్టోరీ: పెళ్లి చూపులకు వెళ్లి దొరికిపోయిందిలా!
నల్గొండ/హైదరాబాద్: తాను రైల్వే పోలీసు కావాలని కలలు కన్నది. అంతేగాక, ఆ దిశగా ప్రయత్నం కూడా చేసింది. కానీ, ప్రయత్న లోపం కారణంగా ఆ యువతి తన కలను నిజం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలో తప్పుడు మార్గంలో తన కలను నిజం చేసుకోవాలనుకుంది. ఏకంగా రైల్వే పోలీస్ డ్రెస్సు వేసుకుని తన కుటుంబాన్ని, తెలిసినవారినందర్నీ తనకు ఉద్యోగం వచ్చిందని నమ్మించింది.
శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌కు విధుల నిమిత్తం వెళ్లి వస్తున్నట్లు నటించింది. ఎక్కడికి వెళ్లినా యూనిఫాంలోనే వెళ్తూ, ప్రముఖులను కలిసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. అయితే, చివరకు తన పెళ్లి చూపులకు కూడా పోలీస్ డ్రెస్సుతోనే వెళ్లింది. దీంతో ఆమె నాటకానికి ఎండ్ కార్డ్ పడింది. పెళ్లి సంబంధం విషయమై యువకుడి కుటుంబీకులు.. రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. విచారణలో నకిలీ పోలీసుగా తేలడంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఈ నకిలీ ఎస్సైని అరెస్టు చేశారు.

ఈ నకిలీ మహిళా రైల్వే ఎస్సై వివరాలను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ సలీమా వెల్లడించారు. నార్కట్‌పల్లికి చెందిన నిందితురాలు మాళవిక నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అర్పిఎఫ్ ఎస్సై పరీక్షలకు హాజరయ్యింది. ఆమెకు కంటి చూపు సరిగా లేక ఎస్సైగా అర్హత సాధించలేకపోయిందని. అయితే, ఎలాగైనా తన తల్లిదండ్రులు, గ్రామస్థుల ముందు పోలీస్‌గా చలామణి అవ్వాలనే ఉద్దేశంతో, నకలీ ఎస్సైగా అవతారమెత్తిందని ఎస్పీ తెలిపారు.
ఈ క్రమంలోనే చివరకుపెళ్లి చూపులకు కూడా రైల్వే పోలీస్ యూనిఫాంలోనే వెళ్లింది. అయితే, సందేహం వచ్చిన అబ్బాయి తరఫు బంధువులు ఆర్పీఎఫ్‌లో ఉన్నతాధికారులను ఆరా తీయగా.. ఆమె అసలు గుట్టు బయట పడిందని ఎస్పీ సలీమా వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన నల్గొండ ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆమె నకిలీ పోలీసుగా మోసపూరిత కార్యక్రమాలకు తెరలేపిందని విచారణలో స్పష్టం అయింది. ఈ నేపథ్యంలో నిందితురాలు మాళవికపై ఫిర్యాదు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్పీ సలీమా తెలిపారు. తదుపరి విచారణ అనంతరం మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications