సాగర్ బీజేపీ అభ్యర్థిపై నో క్లారిటీ: హై కమాండ్‌కు లిస్ట్, కానీ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. సిట్టింగ్ స్థానం తిరిగి గెలవాలని అధికార టీఆర్ఎస్ అనుకుంటోంది. అందులో భాగంగా దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టికెట్ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే జానారెడ్డికి టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం అభ్యర్థి వేటలో ఉంది. ఆ రెండు పార్టీలు అభ్యర్థులను కన్ఫామ్ చేసి.. ప్రచార బరిలో దిగితే.. బీజేపీ మాత్రం బలమైన అభ్యర్థి వేటలో ఉంది. టికెట్ ఎవరికీ ఇవ్వాలనే అంశంపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది.

తేలని బీజేపీ అభ్యర్థి
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి తేలలేదు. టీఆర్ఎస్ అసంతృప్తులు వస్తారని బీజేపీ భావించింది. కానీ అలా జరగలేదు. తేరా చిన్నపురెడ్డి, కోటిరెడ్డి టీఆర్ఎస్ పార్టీ వీడరని తెలుస్తోంది. వీరిద్దరూ టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకుంటే కాషాయ కండువా కప్పుకుంటారని బీజేపీ నేతలు అంచనా వేశారు. కానీ వీరికి టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ హామీ ఇచ్చి బుజ్జగించారు. దీంతో వాళ్లు బీజేపీలో చేరేందుకు వెనక్కి తగ్గారు. కానీ బీజేపీ మాత్రం వీరిపైనే ఆశలను పెట్టుకుంది. కానీ వారు పార్టీలోకి రాకపోవడంతో అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి.

కొందరు పేర్లతో జాబితా
సాగర్ అభ్యర్థి ఎవరనే అంశంపై కొంతమంది పేర్లను హైకమాండ్‌కు పంపించామని బీజేపీ నేతలు అంటున్నారు. అలా ఆశావహులు చాలా మందే ఉన్నారు. కానీ వారిలో ఎవరికీ టికెట్ వస్తుందనే అంశంపై స్పష్టత లేదు. కానీ వీరు మాత్రం ఇప్పటికే సాగర్‌లో ప్రచారం కూడా ప్రారంభించేశారు. వీరికి బీజేపీ అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో కాస్త భయపడిపోతున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్ర పార్టీ పంపిన జాబితాను అధిష్టానం పరిశీలించి బలమైన నాయకుడిని సాగర్ బరిలో దింపుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఆ ప్రాసెస్ వీలయినంత త్వరగా జరగాల్సి ఉంది. లేదంటే మిగతా పార్టీలు దూసుకెళ్లే చాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి.

ఆలస్యానికి కారణమేంటీ..?
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో చనిపోయారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇక్కడ గెలవాలని కాంగ్రెస్, బీజేపీ అనుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావించాయి. ఇందులో కాంగ్రెస్ ముందువరసలో ఉంది. అభ్యర్థిని ప్రకటించి మరీ.. దూసుకెళ్తోంది. కానీ బీజేపీ మాత్రం కాస్త నత్తనడకన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications