నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేకు స్వేరో నేత బెదిరింపు.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదీ లేదు.. ఆడియో వైరల్

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రజలకు సేవ చేస్తానని పదవీకి రాజీనామా చేసి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మొన్న బీఎస్పీలో చేరారు. అనంతరం ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దళిత బంధు కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని ప్రవీణ్‌ కుమార్‌ సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు.

కౌంటర్ అటాక్

కౌంటర్ అటాక్


దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమెల్యే గ్యాదరి కిషోర్‌, మరికొందరు అధికారం పార్టీ నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకోమని కౌంటర్‌ ఇచ్చారు. దీంతో తమ నాయకుడు ప్రవీణ్‌ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్వేరోస్‌ సభ్యులు తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇలా అటాక్- కౌంటర్ అటాక్ కొనసాగుతోంది.​

సంపత్ ఆడియో

సంపత్ ఆడియో

స్వేరోస్‌ సభ్యుడు సంపత్‌ ఓ ఆడియో కాల్‌ వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కు ఫోన్‌ చేసిన సంపత్‌..'నీది ప్రవీణ్‌ కుమార్‌ను విమర్శించే స్థాయా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి ప్రవీణ్‌ కుమార్‌పై ఇ‍ష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చాడు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. ఏడేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దళిత బంధు గుర్తుకువచ్చిందా మీకు అని ప్రశ్నించాడు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. బెదిరిస్తున్నావా అని కిశోర్ అంటే.. భయపడుతున్నవని అర్థమయ్యింది అన్నాడు. తీరు మార్చుకోవాలని.. నీ స్థాయి తెలుసుకోవాలని సంపత్ అన్నారు. ప్రవీణ్ కుమార్ సార్‌ను విమర్శించే పెద్దోడివా అని అడిగాడు. నా స్థాయి ఏంటో తెలుసు.. బెదిరింపులకు దిగొద్దు.. కాలం మారిందని కిశోర్ అన్నాడు. ఇకపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చాడు.

దళితబంధు

దళితబంధు

మరోవైపు హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు.

Recommended Video

Land Grabbing Issue: లక్షల ఎకరాలు కబ్జా.. KCR,TRS పై Sampath Kumar ఘాటు విమర్శలు..
సమయం చూసి..

సమయం చూసి..

చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

English summary
swaero leader sampath threatening call trs mla gadari kishore. kishore comments on rs praveen kumar, he reacts on that call. audio viral in social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X