ఇస్రో..ఇక కమర్షియల్: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ: అమెరికా శాటిలైట్లతో

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ.. ఇస్రో మరో విజయాన్ని అందుకుంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ (పీఎస్ఎల్వీ)-సీ49ను సక్సెస్‌ఫుల్‌గా అంతరిక్షంలోకి పంపించింది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కొద్దిసేపటి కిందటే పీఎస్‌ఎల్వీని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఎర్త్ అబ్వర్వేషన్ శాటిలైట్‌ ఈఓఎస్-01 సహా రెండు వేర్వేరు దేశాలకు చెందిన తొమ్మిది ఉపగ్రహాలను పీఎల్ఎల్వీ-సీ49 అంతరిక్షానికి మోసుకెళ్లింది.

నిర్దేశిత మార్గంలో ఈ రాకెట్ ప్రయాణిస్తోందని ఇస్రో పేర్కొంది. నాలుగో దశలో పీఎల్ఎల్వీ విజయవంతంగా విడిపోయిందని, ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో ఛైర్మన్ కే శివన్ ప్రకటించారు. ఈ మధ్యాహ్నం సరిగ్గా 3:12 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ49ను నింగిలోకి దూసుకెళ్లింది. దీనికోసం శుక్రవారం మధ్యాహ్నం 1.02 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది ఇస్రో. పీఎస్ఎల్వీల ప్రయోగాల పరంపరలో ఇది 51వ మిషన్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ వల్ల ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టడానికి వీలు ఉంది.

Andhra Pradesh: PSLVC49 lifts off successfully from Satish Dhawan Space Centre Sriharikota

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌తో కుదర్చుకున్న వ్యాపారాత్మక ఒప్పందాలకు అనుగుణంగా ఈ మిషన్‌ను చేపట్టామని, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సహకారంతో దీన్ని చేపట్టినట్లు ఇస్రో తెలియజేసింది. కమర్షియల్ అగ్రిమెంట్స్‌లో భాగంగా లిథువేనియాకు సంబంధించిన ఉపగ్రహం, లక్జెంబర్గ్, అమెరికాలకు చెందిన నాలుగు చొప్పున కస్టమర్ శాటిలైట్లను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ49 వాటన్నింటినీ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు కే శివన్ తెలిపారు.

లక్జెంబర్గ్, అమెరికాలకు సంబంధించిన ఉపగ్రహాల ద్వారా మ్యారిటైమ్ అప్లికేషన్స్, మల్టీ-మిషన్ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ మిషన్‌ను విజయవంతం చేసిన తోటి శాస్త్రవేత్తలకు ఆయన అభినందించారు. శాస్త్రవేత్తల సమష్టి కృషితో ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ మిషన్ వల్ల అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఇస్రో తన పేరు ప్రఖ్యాతులను నిలుపుకొన్నట్టయిందని అన్నారు. కమర్షియల్ అగ్రిమెంట్ల సెగ్మెంట్‌ ద్వారా అమెరికన్ శాటిలైట్లను కూడా తాము ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+