మున్సిపోల్స్ : నంద్యాలలో బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కుపుడకలు , నెల్లూరులో ఓటుకు నోటు
ఏపీలో కార్పొరేషన్ , మున్సిపల్ , నగరపంచాయతీల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల్లో గెలవడం కోసం, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం హోరాహోరీగా ప్రచారం చేయడమే కాకుండా, గుట్టుచప్పుడు కాకుండా ప్రలోభాలకు కూడా గురిచేస్తున్నారు . ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బరిలోకి దిగిన అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీశారు.
ఇక ఈ రోజు పోలింగ్ కొనసాగుతున్న సమయంలో కూడా కొందరు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం జోరుగానే చేస్తున్నారు. ఇక ఎన్నికల అధికారుల నిఘా కొనసాగుతుంది .

నంద్యాలలో స్వతంత్ర అభ్యర్థి నిర్వాకం .. బిర్యానీ పొట్లాల్లో ముక్కు పుడకలు
నిన్నటికి నిన్న ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో ఓటర్లకు గాలం వేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డు లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఓటర్లను డబ్బులు, బంగారంతో మభ్య పెట్టాలని చూశాడు. తనకు ఓటు వెయ్యాలని విజ్ఞప్తి చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా బిర్యానీ పొట్లం లో ముక్కు పుడకను పెట్టి ఓటర్లకు పంపిణీ చేయించాడు .

కర్ణాటక రాష్ట్రం నుండి కిరాయికి మనుషులు .. జోరుగా నగదు, ముక్కుపుడకలు
ఇందుకోసం కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించి వారి ద్వారా నగదు అలాగే బిర్యాని పట్నంలో ముక్కుపుడకలు పంపిణీ చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బిర్యానీ పొట్లాలు పంపిణీ చేస్తున్న వారి నుండి 55 వేల నగదు 23 బంగారం ముక్కు పుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. బిర్యానీ పొట్లాలను పంపిణీ చేసిన రాఘవేంద్ర స్వామి, రవికిరణ్ ,మోహన్ ల ను అరెస్ట్ చేశారు. వారి నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి శ్యామ్ సుందర్ లాల్ తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

నెల్లూరులోనూ ప్రలోభాల పర్వం .. ఓటుకు ఒకరు రెండు వేలు , మరొక అభ్యర్థి వెయ్యి
అటు నెల్లూరు లోనూ ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతుంది. ఎన్నికల్లో ఓటు వెయ్యటానికి డబ్బును ఎరగా వేశారు కొందరు అభ్యర్థులు . ఓటుకు రెండు వేలు కొందరు, వెయ్యి రూపాయలు మరికొందరు ఇచ్చి తమ పార్టీకే ఓటు వెయ్యాలని కోరినట్టు ఓటర్లు కొందరు చెప్తున్నారు. ఈ సారి ఎన్నికలను అధికార , ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వేళ ఎన్నికల్లో డబ్బు పంచుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఓటర్ల ప్రలోభాల పర్వం కొనసాగుతుంది .
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications