నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి నువ్వెవరు?
నెల్లూరు జిల్లా 'గాజుగ్లాసు'లో 'పగుళ్లు' ఏర్పడుతున్నాయి. నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి
నెల్లూరు జిల్లా 'గాజుగ్లాసు'లో 'పగుళ్లు' ఏర్పడుతున్నాయి. నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. చిన్న విషయంలో ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పోలీసు కేసుల వరకు వెళ్లింది. అనంతరం సస్పెన్షన్ల బాట పట్టింది. నెల్లూరు అర్బన్ కు చెందిన జనసేన పార్టీ నాయకుడు కేతంరె్డి వినోద్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. దీంతో వివాదం ఇంకా పెద్దదైంది. అసలు జనసేన పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడానికి మనుక్రాంత్ రెడ్డి ఎవరని వినోద్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
'ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీలో.. మరో కానిస్టేబుల్ కొడుకుకి టికెట్ ఇచ్చానని.. మీరంతా ఆశీర్వదించండి అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని, అందుకే ఆయన స్పూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వినోద్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల పవనన్న ప్రజా బాట కార్యక్రమంతో నిత్యం ప్రజల్లో తిరుగుతున్నానని, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ప్రజలకు చెబుతున్నామన్నారు. పవనన్న ప్రజా బాటను 270 రోజులుగా నిర్వహిస్తున్నామని, ఈ నినాదంతోనే ఇప్పటికీ లక్షా 50 వేల స్టిక్కర్లను నెల్లూరు నగరంలో అంటించినట్లు పార్టీ కార్యక్రమాలను కేతంరెడ్డి వినోద్ రెడ్డి వివరించారు.

ఒక స్టిక్కర్ మీద మరో స్టిక్కర్ అంటించడంతో దాన్ని గురించి మాట్లాడుకుందామని పిలవగా, అవతలి వ్యక్తులు కేసు పెట్టారని, దీన్ని గురించి సీఐ ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని తమ కుటుంబాలను కూడా వదిలి తిరుగుతున్నామని, ఈ స్థాయికి దిగజారడం దేనికని, ఎస్సీ, మైనారిటీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. పనిచేస్తున్నందుకు తమకిచ్చే బహుమానం ఇదా అని నాయకులంతా బాధపడుతున్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని, సస్పెండ్ చేస్తూ ఇచ్చి లేఖ కూడా తాను చూడలేదని, పవన్ కల్యాణ్ కు, నాదెండ్ల మనోహర్ కు, నాగబాబుకు జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పానన్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షులకు లేదని పెద్దలు చెప్పారని, అందుకే మళ్లీ తనపని తాను చేసుకుంటున్నానన్నారు.












Click it and Unblock the Notifications