Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం పదవీకి కేటీఆరే కరెక్ట్..? షకీల్ అహ్మద్ నోట మరోసారి ముఖ్యమంత్రి మాట..

రాష్ట్రంలో రాజకీయాలు స్తబ్దుగా ఉన్నాయి. కానీ సీఎం మార్పు అంశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ తర్వాత ఎవరనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. చాలా మంది కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని అంటున్నారు. ఇదివరకు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినా.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మరోసారి ఇలానే మాట్లాడారు. సీఎం పదవీకి కేటీఆర్ సమర్థుడు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. షకీల్ అహ్మద్ కామెంట్స్ మరోసారి చర్చకు దారితీసింది.

Recommended Video

    #Hyderabad : KTR Inaugurates 2BHK 'Dignity Houses' In Baghlingampally| Oneindia Telugu
    కేటీఆర్ సీఎం..?

    కేటీఆర్ సీఎం..?

    కేటీఆర్ ను సీఎం చేయాలనే అభిప్రాయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేటీఆర్‌ను సీఎం చేస్తే తప్పేంటి అని మంగళవారం మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇవాళ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ దానికి మద్దతు పలికారు. సీఎం పదవీకి కేటీఆర్ సమర్థుడని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అన్నారు.

    అభివృద్ధి ఎజెండా..

    అభివృద్ధి ఎజెండా..

    సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని రాష్ట్రంలోని యువత కోరుకుంటుందని తెలిపారు.

    యువతకు పదవులు

    యువతకు పదవులు

    కేటీఆర్ సీఎం అయితే పార్టీలోని యువతకు పదవులు వస్తాయని సంకేతం ఇచ్చినట్టు అవుతోందని షకీల్ అన్నారు. కేటీఆర్ సీఎం అయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. షకీల్ కామెంట్స్ టీఆర్ఎస్ పార్టీలో దుమారం రేపే అవకాశం ఉంది. వరసగా నేతలు కేటీఆర్‌ను సీఎం చేయాలని కోరే అవకాశం ఉంది. మరీ దీనికి గులాబీ దళపతి ఏ విధంగా స్పందిస్తారో చూడాలీ.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+