బస్టాండ్ లో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం .. కిడ్నాపర్ కు దేహశుద్ధితో బయటపడిన నిజం
నిజామాబాద్ నగరం లో దారుణం చోటుచేసుకుంది. ఏడాదిన్నర వయస్సున్న బాబు అపహరణకు గురి కాగా నేడు బాసరలో విగతజీవిగా పోలీసులకు దొరికాడు. కిడ్నాపర్ , బాబు తల్లి బస్టాండ్ లో ఉన్న సమయంలో మాయమాటలు చెప్పి ఏడాదిన్నర బాబును అపహరించాడు . అప్పటినుండి బాబు కోసం తల్లడిల్లుతున్న ఆ తల్లి కిడ్నాపర్ ని చూసి గుర్తుపట్టి నడిరోడ్డుపై చెట్టుకు కట్టేసి తమ వారితో కలిసి దేహశుద్ధి చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది.
బస్టాండ్ లో బాలుడి కిడ్నాప్ .. బాబు కోసం తల్లి వెతుకులాట
నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ సంవత్సరన్నర బాబుతో బస్టాండ్ లో ఉన్న సమయంలో నిర్మల్ జిల్లా బాసర కు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపి, ఆమెను నమ్మించి దగ్గరలోని ఒక ప్రాంతానికి తీసుకువెళ్లి, చాకచక్యంగా బాబును అపహరించాడు . ఈనెల 11న ఈ ఘటన జరిగింది. అప్పటినుండి బాబు కోసం వెతుకులాడుతున్న తల్లి, ఆమె బంధువులు, పదిహేను రోజుల తర్వాత నిందితుడిని గుర్తించారు.

నిజామాబాద్ మునిసిపాలిటీ వద్ద కిడ్నాపర్ ను చెట్టుకు కట్టేసి దేహ శుద్ధి
నిజామాబాద్ మున్సిపాలిటీ వద్ద నాగరాజు కనిపించడంతో తన కొడుకు ఎక్కడ అని అతనికి దేహశుద్ధి చేసిన తల్లి ఆమె బంధువులు, చెట్టుకు కట్టేసి కొట్టారు. తన కొడుకు జాడ చెప్పమని ఆ తల్లి ఆగ్రహంతో అతనిని చావబాదింది .
స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వన్ టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిని అరెస్టు చేసి బాబు కు సంబంధించిన వివరాలు కనుక్కున్నారు. అయితే ఆరోజు తన పక్కనున్న బాబు ఎవరో ఎత్తుకు వెళ్లారని సమాధానం చెప్పిన నిందితుడు నాగరాజు, పోలీస్ మార్క్ ఎంక్వయిరీ లో అసలు విషయం చెప్పాడు. అంతేకాదు సిసి టివి ఫుటేజ్ లో కూడా నాగరాజు బాబుని ఎత్తుకు వెళుతున్న విజువల్స్ స్పష్టంగా ఉన్నాయి.
బాసరలో బాబు మృతదేహం లభ్యం ... కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఒన్ టౌన్ పోలీసులకు నిందితుడు ఇచ్చిన సమాచారంతో, బాసర పోలీసులను అప్రమత్తం చేయగా, బాసరలో బాబు మృతదేహం ఓ చెట్టుకింద కనిపించింది. దీంతో బాబు తల్లి,ఆమె బంధువులు విగతజీవిగా పడి ఉన్న బాబును చూసి బోరున విలపిస్తున్నారు.
బాబు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు . అయితే అసలు నాగరాజు ఎవరు? నాగరాజుకి, లక్ష్మికి ఉన్న సంబంధం ఏంటి? లక్ష్మీ ఏడాదిన్నర బాబును నాగరాజు ఎందుకు చంపాడు ?ఈ కిడ్నాప్ మిస్టరీ వెనుక అసలు కారణం ఏంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications