• search
  • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పబ్జీ ఎఫెక్ట్ .. సిద్దిపేటలో మరో యువకుడు బలి

|

పబ్జీ .. ఇప్పుడు దేశవ్యాప్తంగా యువత కు పట్టిన ఫోబియా. మొన్నటికి మొన్న ఒకతను పబ్జీ ఆడుకుంటూ మంచి నీళ్ళ కు బదులు యాసిడ్ తాగితే, తాజాగా మరో యువకుడు ఇంట్లో పబ్జీ ఆడొద్దు అన్నారని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. యువతకు వ్యసనంగా మారిన పబ్జీ గేమ్ వల్ల యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ ఆటను తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది.

యువత భవిష్యత్ ను ఛిద్రం చేస్తున్న పబ్జీ

యువత భవిష్యత్ ను ఛిద్రం చేస్తున్న పబ్జీ

పబ్జీ గేమ్ ... ఇప్పుడు యువతకు వైరస్ లా పట్టుకున్న గేమ్. చదువుల సైతం పక్కనపెట్టి ఎప్పుడు చూసిన చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ఈ గేమ్ మత్తులో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు యువత. అంతేకాదు తల్లిదండ్రులు వద్దని చెప్పినా వినిపించుకోకుండా, పక్క ప్రపంచంతో సంబంధమే లేనట్టు ఈ గేమ్ మోజులో పడి కొట్టుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ గేమ్ కు బానిసలవుతున్నారు. అంతేకాదు పబ్జీ మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

తల్లిదండ్రులు గేమ్ ఆడవద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

తల్లిదండ్రులు గేమ్ ఆడవద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

మొన్నటికి మొన్నముంబై లో ఒక యువకుడు పబ్జీ ఆడేందుకు ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా మరో యువకుడు పబ్జీ గేమ్ లో పడి మంచినీళ్ళనుకుని యాసిడ్ తాగాడు. తాజాగా సిద్దిపేటలో ఒక యువకుడు ఇంట్లో తల్లిదండ్రులు పబ్జీ గేమ్ ఆడవద్దని మందలించారని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జరిగిన ఈ ఘటన యువత ఎంతగా పబ్జీ గేమ్ కు అడిక్ట్ అవుతున్నారో తేటతెల్లం చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో గుప్పుమంటున్న గంజాయి... భద్రాచలంలో 6 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

పబ్జీ గేమ్ కోసం ఉరి వేసుకుని ఆత్మహత్య .. తల్లిదండ్రులకు కడుపు కోత

పబ్జీ గేమ్ కోసం ఉరి వేసుకుని ఆత్మహత్య .. తల్లిదండ్రులకు కడుపు కోత

మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శేషత్వం వెంకటనారాయణ- శారద దంపతుల చిన్న కుమారుడు సాయిచరణ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతడు కొన్ని రోజులుగా పబ్జీ గేమ్‌కు అలవాటు పడి చదువును నిర్ణక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు అతడిని ఆ గేమ్ ఆడవద్దని మందలించారు.అయినా, అతడు వారి మాటను వినలేదు. దీంతో గేమ్ ఆడవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు . దీంతో మనస్థాపానికి గురైన సాయిచరణ్.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొడుకు గదిలో ఏం చేస్తున్నాడోనన్న అనుమానంతో వచ్చి చూసే సరికి సాయిచరణ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. పక్కింటి వారి సాయంతో తలుపులు పగలకొట్టి అతడిని బయటికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే సాయిచరణ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేవలం పబ్జీ గేమ్ కోసం సాయి చరణ్ ఎన్నో ఆశలతో పెంచిన తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An young man allegedly committed suicide by hanging himself after he had an argument with his family members over playing PUBG game. The teenager, who was a resident of Praghnapur, Siddhipet district , took the extreme step when he wanted to play the online game and the parents warned him not to play the game. Feeling distraught, the teenager then took a rope and allegedly committed suicide by hanging himself from the ceiling fan in his residence.A case of suicide has been registered by Praghnapur police and further investigation in the matter is underway.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more