సంక్రాంతికి మంత్రి శుభవార్త.. భారీగా ఉద్యోగాల భర్తీ!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా విద్య, వైద్యం పైన ఫోకస్ చేస్తున్న తెలంగాణ సర్కార్ ప్రజలకు ఉపయోగపడేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగంలో సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడుతోంది.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ
రాష్ట్రంలో ముఖ్య నగరాలలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయటంతో పాటు ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరతను నివారించటం కోసం చర్యలకు ఉపక్రమించింది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ చెయ్యాలని సంకల్పించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు తరఫున ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్షలను నిర్వహించారు.

1257 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన 1257 మంది అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈరోజు నియామక పత్రాలు అందజేశారు.ఉస్మానియా మెడికల్ కళాశాల (కోఠి), మైదానంలో ఈ మధ్యాహ్నం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి దామోదర్ రాజ నర్సింహ తెలిపారు.
రాబోయే రోజుల్లో మరో 10 వేల పోస్టుల భర్తీ
మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2 లకు అందించిన ఆయన ఈ సందర్భంగా రాబోవు రోజుల్లో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరో 10 వేల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని ఆయన అన్నారు. నగరవ్యాప్తంగా 145 పాలి క్లినిక్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు.
35 నుంచి 40 కిలోమీటర్లకు ఒక ట్రామా క్లినిక్
ప్రతి 35 నుంచి 40 కిలోమీటర్లకు ఒక ట్రామా క్లినిక్ ను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యాధిని నిర్ధారించాలంటే ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని అటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు అంకితభావంతో పనిచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.రానున్న రోజుల్లో మరో పదివేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి సంక్రాంతి పండుగకు ముందు తీపి కబురు చెప్పారు.












Click it and Unblock the Notifications