పాపం పసివాడు: విమానంలో ఊపిరాడక మృతి
హైదరాబాద్ : మొన్న ఒక విమానంలో ఊపిరి ఆడక ప్రయాణికులు అస్వస్థతకు గురైన సంఘటన మరవకముందే ఖతార్‌కు చెందిన విమానంలో విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతిచెందడం అందరిని కలిచివేసింది. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ విమానం దోహా నుంచి అతని తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్నాడు. విమానం ఎక్కినప్పటి నుంచే ఊపిరితీసుకోవడంలో అర్నవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు.అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు.
దీంతో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వగానే వెంటనే చిన్నారిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు ఖతార్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. అయితే బాబు అప్పటికే చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించినట్లు తెలిపింది. శ్వాస ఆడకనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.

ఆర్నవ్ వర్మకు అమెరికా పాస్‌పోర్ట్ ఉండగా, బాబు తండ్రి అనిల్ వర్మకు భారత పాస్‌పోర్ట్ ఉంది. వారు ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎస్‌ఆర్-500లో హైదరాబాద్‌కు వచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications