ఫోన్ ట్యాపింగ్: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్, కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అంతర్గత విచారణలో ఆధారాలు లభ్యం కావడంతో మార్చి 4న ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో ప్రణీత్ రావు సిరిసిల్ల డీఎస్పీగా ఉన్నారు. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెక్వార్టర్స్ ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో.. ప్రణీత్ రావు తన కుటుంబంతో సహా అక్కడే ఉన్నారు.

14 days remand to praneeth rao in phone tapping case

కాగా, మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు. జ్యూడీషియల్ కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, ఈ కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

సస్పెన్షన్ ఆర్డర్‌లో కీలక విషయాలు

కాల్​ ట్యాపింగ్​ (ఫోన్ ట్యాపింగ్) వ్యవహారంలో సస్పెండ్​ అయిన ఎస్​ఐబీ డీఎస్పీ ప్రణీత్​ కుమార్​ రావు సస్పెన్షన్​ ఆర్డర్‌​లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో డీఎస్పీగా పని చేస్తున్న ప్రణీత్​ రావు.. గతంలో హైదరాబాద్​ ఎస్​ఐబీలో పని చేస్తున్న సమయంలో తన హోదాను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు పోలీసు శాఖ గుర్తించింది.

తన ఎస్​ఓటీ బృందం కోసం హైదరాబాద్​ ఎస్​ఐబీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్నెట్​ సదుపాయాన్ని ప్రణీత్​ ఏర్పాటు చేసుకున్నట్లు సస్పెన్షన్​ ఆర్డర్‌​లో పేర్కొన్నారు. ఈ తతంగమంతా అతనే నడిపినట్లు అధికారులు తేల్చారు. కంప్యూటర్‌​లోని 42 హార్ట్​ డిస్క్‌​లు కూడా మార్చినట్లు గుర్తించారు. పలువురి ఫోన్​ ట్యాపింగ్‌​కు సంబంధించిన కాల్​ డీటైల్​ రికార్డ్స్​, ఐఎంఈఐ, ఇంటర్నెట్​ ప్రోటోకాల్​ రికార్డులను ప్రవీణ్​ డిలీట్​ చేశారు. ఎలక్ట్రీషియన్​ సాయంతో ఎస్​ఐబీ భవనంలో సీసీ కెమెరాలు ఆఫ్​ చేయించి హార్ట్​ డిస్కులు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+