1410 పాజిటివ్ కేసులు నమోదు, గ్రేటర్ పరిధిలో 918 పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1500 తగ్గడం లేదు. నిన్న 1924 కేసులు రావడంతో ఒకింత ఆందోళన నెలకొంది. గురువారం 1410 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 5 వేల 954 మంది శాంపిల్స్ పరీక్షించారు. 1410 కేసులతో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేల 946కి చేరింది. కరోనా వైరస్ వల్ల ఇవాళ కూడా ఏడుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 331కి చేరింది.

 1410 coronavirus positive cases register in telangana..

913 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా.. ఇంటికి పంపించారు. వీరితో కలిపి వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 18 వేల 192కి చేరింది. వివిధ ఆస్పత్రులు/ హోం క్వారంటైన్‌లో 12 వేల 423 మంది చికిత్స తీసుకున్నారు. అయితే హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇవాళ మరో 918 కేసులు వచ్చాయి. నిన్న 1590 పాజిటివ్ కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో 125, సంగారెడ్డి జిల్లా 79, మేడ్చ‌ల్ జిల్లా‌ 67 మందికి వైరస్ సోకింది.

Recommended Video

    India Global Week 2020: PM Modi Speech కరోనా తరువాత భారత్ అగ్రగామిగా మారుతుంది..!! | Oneindia Telugu

    వరంగల్ అర్బన్‌ 34, కరీంనగర్‌ 32, భద్రాద్రి కొత్తగూడెం 23, నల్గొండ 21, నిజామాబాద్‌ 18, మెదక్‌ 17, ఖమ్మం 12, సూర్యాపేట 10, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్లలో 8, వరంగల్ రూరల్‌ 7, జయశంకర్ భూపాలపల్లి 6, వికారాబాద్‌, మహబూబాబాద్‌లో 5, కామారెడ్డి, యాదాద్రి, జనగామ, వనపర్తి, గద్వాల్‌లో రెండు చొప్పున, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ములుగు, సిద్దిపేటలో ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+