వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలకలం: భారీ శబ్దంతో కుంగిన 4అంతస్తుల భవనం, భూమిలోకి గ్రౌండ్‌ఫ్లోర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం భూమిలోకి కుంగిపోయిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కాజీపేట పట్టణంలోని 35వ డివిజన్ భవానీ నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్ 4 భవంతి మంగళవారం రాత్రి పది గంటల సమయంలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా భూమిలోకి కుంగింది.

సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌లు కనిపించకుండా భూమిలోకి పోయాయి. దీంతో నాలుగంతస్తుల భవనం కాస్త రెండంతస్తులుగా కనిపిస్తోంది. రూ.1.50 కోట్లకు పైగా నష్టం జరిగిందని భావిస్తున్నారు. భీమదేవరపల్లి మండలం కొప్పూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ రెడ్డి భవానీ నగర్‌లో కొత్తగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవనం పనులు దాదాపు చివరికి వచ్చాయి.

భారీ వర్షాలకు భూమి నాని, కుంగిన భవనం

భారీ వర్షాలకు భూమి నాని, కుంగిన భవనం

అయితే, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూమి నానింది. దీంతో భవనం బరువుకు సెల్లార్‌తోపాటు మొదటి అంతస్తు భూమిలోకి కుంగిపోయింది. ఈ విషయాన్ని పక్కన ఉన్న వారు స్థానిక పోలీసులకు తెలిపారు. దీంతో వారు హుటాహుటిన సంఘటనస్థలానికి వచ్చారు. కాజీపేట, మడికొండ పోలీసులు కుంగిన భవనం చుట్టూ ఉన్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించారు. అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారు.

సెక్యూరిటీ ఆచూకీ లేదు

సెక్యూరిటీ ఆచూకీ లేదు

భవనం సెక్యూరిటీ గార్డు భిక్షపతి ఆచూకీ దొరకడంలేదు. విషయం తెలుసుకున్న అతని భార్య మణెమ్మ, ఇద్దరు పిల్లలు, ఇతరులు ఆచూకీకి వెతుకుతున్నారు. భవనం వద్దకు వెళ్లొద్దని పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి స్థానిక పలువురు రాజకీయ నాయకులు చేరుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు భవనం వద్ద బందోబస్తు కొనసాగించారు.

ప్లాస్టరింగ్ పనులు చేసి వెళ్లిపోయిన కూలీలు

ప్లాస్టరింగ్ పనులు చేసి వెళ్లిపోయిన కూలీలు


ఈ భవనం పనులు ఏడాది నుంచి కొనసాగుతున్నాయి. కూలీలు మంగళవారం ఉదయం భవనానికి ప్లాస్టరింగ్ పనులు చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత రాత్రి పది గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా, భూమి నానడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించని కారణంగా కూడా భవనం కుంగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

 అన్ని అనుమతులు తీసుకున్నారా?

అన్ని అనుమతులు తీసుకున్నారా?

ఏడాది కాలంగా ఈ భవన నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం పంచుకున్న వాచ్‌మెన్.. ఈ ఘటన తర్వాత కనిపించడం లేదు. అయితే రాత్రి వేళ కావడంతో అతను ఆ భవనంలో నిద్రిస్తున్నాడా లేక బయట ఉన్నాడా తెలియాల్సి ఉంది. భవనం నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్నారు, ప్రమాణాలు పాటించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
4 Storey under construction building sinks in Warangal district's Kazipet on Tuesday night due to heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X