ఉద్యమ కార్యకర్త నుండి.. మంత్రిగా... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎదిగిన కేటిఆర్

Recommended Video

    రెండోసారి మంత్రిగా కేటిఆర్‌ ప్రస్థానం || KTR Profile As Second Time Minister In TRS Government

    తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణలో కేసిఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్‌కు స్థానం లభించింది. గత కొద్ది రోజుల క్రితం పార్టీ బాధ్యతలు తీసుకున్న కేటిఆర్ గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వ బాద్యతలకు దూరంగా ఉన్నారు. ఇటివల ఆయన ప్రభుత్వంలో కొనసాగాలని ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ ట్విట్టర్‌లో ఆకాంక్షించారు. ఈనేపథ్యంలోనే 43 సంవత్సరాల కేటీఆర్ మరోసారి మంత్రివర్గ బాధ్యతలు చేపట్టారు.

    ప్రభుత్వ,పార్టీ భాద్యతల్లో కేటిఆర్

    ప్రభుత్వ,పార్టీ భాద్యతల్లో కేటిఆర్

    తెలంగాణ ఉద్యమ సారధీ కేసిఆర్ తనయుడిగా ఉద్యమంలో కీలక పోషించిన కేటిఆర్ ఇటివల పార్టీ ఇచ్చిన కార్పోరేషన్ ఎన్నికల్లో ఆనుహ్య విజయం సాధించిన విజయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే మొత్తం 150 కార్పోరేషన్ స్థానాలకు గాను 99 స్థానాలను గెలిచి టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. దీంతో కేటీఆర్‌కు పార్టీ కీలక బాద్యతలు అప్పగించారు సీఎం కేసిఆర్. ఇక తాజగా మంత్రి బాధ్యతలు కూడ చేపట్టనున్న కేటిఆర్ అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వ బాధ్యతలు కూడ చేపట్టారు.

    విద్యాభ్యాసం

    విద్యాభ్యాసం

    ఇక 1976 జూలై 24న ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులకు జన్మించిన కేటిఆర్ విద్యాభ్యాసం అంతా కరీంనగర్‌, హైదరాబాద్‌తోపాటు గుంటూరు, న్యూయార్క్‌ల్లో కొనసాగింది. ఇక రెండు పీజీ కోర్సులు చేసిన కేటిఆర్ పూణే యూనివర్సిటిలో ఎమ్మెస్సీ పూర్తిచేయగా సిటి యూనివర్సిటి ఆఫ్ న్యూయార్క్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం కొద్ది రోజులు అమేరికాలో నే ఉద్యోగం చేసిన ఆయన 2006లో తండ్రి కేసిఆర్‌కు మద్దతుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

     2009లో మొదటి సారి ఎమ్మెల్యేగా కేటీఆర్

    2009లో మొదటి సారి ఎమ్మెల్యేగా కేటీఆర్

    తన రాజకీయ జీవితంలో మొదటి సారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన ఇండిపెండెంట్ అభ్యర్థి కేకే మహెందర్ రెడ్డిపై 171 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు.అయితే సంవత్సరంలోనే ఉద్యమంలో భాగంగా రాజీనామ చేసిన ఆయన మరోసారి తిరిగి 2010 జూలైలో 68వేల అత్యధిక మెజారిటితో సమీప కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేకే మహెందర్ రెడ్డిపై గెలుపోందారు. అనంతరం జరిగిన అనేక ఉద్యమ పరిమాణాల్లో భాగస్వామ్యుడైన కేటీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడోసారి సైతం సిరిసిల్ల నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండురి రవిందర్ రావుపై 58 వేల ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. అనంతరం జూన్ 2 ,2014లో మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.కొద్ది రోజుల అనంతరం పంచాయితీ రాజ్‌ శాఖను మంత్రి జూపల్లికి అప్పగించి, పరిశ్రమల శాఖను చేపట్టారు. ఇక గత ఎన్నికల్లో లక్ష ఇరవై వేలకు పైగా మెజారిగితో గెలుపోందారు.

    మంత్రిగా పలు విషయాల్లో విజయం..

    మంత్రిగా పలు విషయాల్లో విజయం..

    ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటిఆర్ హైదరాబాద్‌లో కార్పోరేషన్‌లో చరిత్ర సృష్టించారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు లేనంత మెజారిటిని సాధించిపెట్టారు. ఎన్నికల్లో మొత్తం 100 సమావేశాల్లో పాల్గోన్న ఆయన హైదరాబా‌ద్‌లో ఉన్న మొత్తం 150 కార్పోరేటర్లకు గాను 99 స్థానాలను స్వీప్ చేసి ఏకపక్షంగా విజయం సాధించారు. దీంతో కేటీఆర్ ఇమేజ్ రాష్ట్రవ్యాప్తంగా మారుమ్రోగింది.కాగా అంతకు ముందు గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 24 సీట్లకు గాను రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండేవి. మరోవైపు ఐటీ శాఖలో ఇటివల ప్రారంభించిన ఆమేజాన్‌తో పాటు పలు సాఫ్ట్‌వేర్ కంపనీలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆయన 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధంగా నిబంధనలు తీసుకువచ్చి పరిశ్రమల రంగంలో కూడ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+