హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి 600 ప్రత్యేక బస్సులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది.

వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో డిపో నుంచి గరిష్టంగా 30 నుంచి కనీసం 15 బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈ సర్వీసులను భక్తులు వినియోగించుకుని గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

600 special buses for Ganesh Immersion in Hyderabad

అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా ప్రజలకు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 17న అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. ఈ మేరకు హెచ్‌ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన నిమజ్జనం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లపై సమీక్షించారు.

మెట్రోలో రద్దీ : ఈ నెలలో ఖైరతాబాద్ గణేశ్ సందర్శనతో మెట్రో రైలు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా నమోదైందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం (సెప్టెంబరు 14వ తేదీ) ఒక్క రోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి 94 వేల మంది ప్రయాణించారని తెలిపారు. 39వేల మంది ఎంట్రీ, 55 వేల మంది ఎగ్జిట్​లు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్​లో నమోదైనట్లు వివరించారు.

ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేటు భద్రతా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఖైరతాబాద్​కు వచ్చే మెట్రో ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు, గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఎంఎంటీఎస్ అదనపు ట్రిప్పులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+