బూట్ల క్రింద 8కోట్ల విలువైన బంగారం..ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23మంది!!

తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దాదాపు 8 కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కస్టమ్స్ అధికారులకు పట్టుబడకుండా కొత్త పుంతలు తొక్కుతున్నారు. బంగారం అక్రమ రవాణా చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నా సరే అక్రమార్కులు బంగారం అక్రమ రవాణా చెయ్యాటానికి ప్రయత్నిస్తున్న తీరు బంగారం స్మగ్లింగ్ మాఫియా ఎంతగా విస్తరించిందో చెప్పకనే చెప్తుంది. పురుషులు మాత్రమే కాదు విద్యార్థులు ,మహిళలు సైతం విదేశాల నుండి బంగారం అక్రమ రవాణాకు ఎవరికీ దొరకకుండా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తూ పట్టుబడుతున్నారు.

8 కోట్ల విలువైన 15 కిలోల బంగారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో స్వాధీనం

8 కోట్ల విలువైన 15 కిలోల బంగారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో స్వాధీనం


తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గతంలో ఎన్నడూ పట్టుబడనంత బంగారాన్ని పట్టుకున్నారు. దాదాపు 8 కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ దేశం నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు తమ షూస్ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేశారు. సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో కష్టం అధికారులు తనిఖీ చేయగా వారి షూస్ కింద ప్రత్యేకంగా తయారు చేసిన అరలలో బంగారాన్ని గుర్తించారు. వారి వద్ద నుండి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు


ఇప్పటికి బంగారం స్మగ్లింగ్ కు సంబంధించిన నలుగురిని అరెస్టు చేసిన అధికారులు మిగతా వారందరిని విచారిస్తున్నారు. వీరు బంగారాన్ని ఎక్కడినుండి ఎక్కడికి తీసుకు వెళుతున్నారని కూపీ లాగుతున్నారు. కాగా ఇటీవల కాలంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టు పడడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు. కస్టమ్స్ అధికారులకు పట్టుబడకుండా బంగారం స్మగ్లర్లు ఈ తరహా చర్యలకుపాల్పడడం నిత్యకృత్యం అయిపోతున్నాయి.

ఎన్ని కేసులైనా సరే ఆగని బంగారం స్మగ్లింగ్ దందా

ఎన్ని కేసులైనా సరే ఆగని బంగారం స్మగ్లింగ్ దందా

బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా, కేసుల పాలుఅవుతారంటూ కస్టమ్స్ అధికారులు, ఎయిర్ పోర్ట్ పోలీసులు హెచ్చరిస్తున్నా ఏ మాత్రం భయం లేకుండా కొందరు స్మగ్లర్లు దందా సాగిస్తున్నారు. అక్రమార్కులు నిత్యం ఏదో ఒక రకంగా అడ్డదారిలో బంగారం అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు, ఎయిర్ పోర్ట్ పోలీసులకు అడ్డంగా పట్టుబడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+