హైదరాబాద్‌లో ఘోరం: మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతిని వివస్త్రను చేసిన యువకుడు

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులు ఓ యువకుడు మృగంలా ప్రవర్తించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేశాడు. చుట్టుపక్కల ఉన్నవారు ఈ దుశ్చర్యను అడ్డుకోవాల్సింది పోయి ఫొటోలు, వీడియోలు తీస్తూ వారిలో ఉన్న మానవత్వాన్ని మంటగలిపారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య(30) కూలీగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు తల్లితో కలిసి బాలాజీనగర్ బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో స్థానిక యువతి(28) దుకాణం నుంచి నడుచుకుంటూ వెళుతోంది. ఆమెను చూసిన మారయ్య ఆమెపై చెయ్యివేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోప్పడిన యువతి అతడ్ని దూరంగా నెట్టేసింది.

young woman

ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన మారయ్య.. ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బలవంతంగా ఆమె దుస్తులను చించి లాగేశాడు. పక్కన ఉన్న మారయ్య తల్లి కనీసం అతడ్ని అడ్డుకోలేదు. అటు నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఆమెపైనా దాడికి ప్రయత్నించాడు.

దాదాపు 15 నిమిషాలపాటు ఆ యువతి నగ్నంగా రోడ్డుపైనే రోదిస్తూ కూర్చున్నా.. చుట్టుపక్కలవారు స్పందించకపోవడం శోచనీయం. కొందరైతే ఫొటోలు, వీడియోలు తీస్తూ తమ పైశాచికాన్ని చాటుకున్నారు. ఆ యువకుడు వెళ్లిపోయిన తర్వాత కొందరు వచ్చి ఆమెను కవర్లతో కప్పేసి జవహర్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+