చికాగో రోడ్లపై ఆకలితో హైదరాబాదీ యువతి; మంత్రి జైశంకర్‌కు యువతి తల్లి కన్నీటిలేఖ!!
చదువుకోవడం కోసం దేశం కాని దేశం వెళ్లి అమెరికాలోని చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న ఒక యువతి కథ ఇది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు వెళ్లిన హైదరాబాద్ మౌలాలి కి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి చికాగో వీధులలో ఆమె వస్తువులు దొంగలించబడడంతో నిరాశ నిస్పృహలో ఆకలితో సవాళ్లను ఎదుర్కొంటూ దుర్భరమైన పరిస్థితులను గడుపుతోంది.
తన కూతురు దుర్భర పరిస్థితిపై యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు లేఖ రాశారు. 2021 ఆగస్టులో చదువుకోవడం కోసం చికాగో వెళ్ళింది సయ్యదా లులు మిన్హాజ్ జైదీ . డెట్రాయిట్ లోని ట్రిని విశ్వవిద్యాలయం నుండి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో తన మాస్టర్స్ అభ్యసించడానికి వెళ్లిందని లేఖలో పేర్కొంది.

ఆ తర్వాత కొంతకాలం పాటు తనతో ఫోన్లో మాట్లాడిందని, అయితే గత రెండు నెలల నుంచి తమ కుమార్తె తమతో టచ్లో లేదని తల్లి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా తన కుమార్తె చికాగో వీధుల్లో ఆకలితో అలమటిస్తున్నదని, ఆమె వస్తువులన్నీ దొంగతనానికి గురయ్యాయని, తీవ్రమైన డిప్రెషన్లో ఆమె ఉందని తెలిసిందని లేఖలో తెలిపారు.
Ms.Syeda Lulu Minhaj Zaidi from Hyd went to pursue MS from TRINE University, Detroit was found in a very bad condition in Chicago, IL. Her mother has appealed @DrSJaishankar to bring back her daughter. Would appreciate the immediate help. @HelplinePBSK @IndiainChicago… pic.twitter.com/dh4M4nPwxZ
— Khaleequr Rahman (@Khaleeqrahman) July 25, 2023
తన కుమార్తెను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి భారతదేశ విదేశాంగ శాఖ సహాయం చేయాలని ఆమె విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే విషయాన్ని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ఖలీకర్ రెహమాన్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అత్యంత బాధ కలిగించే ఈ లేఖ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
కుమార్తె పరిస్థితి తెలిసి ఆమె కోసం కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న తల్లి వాషింగ్టన్ డిసి లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి అలాగే చికాగోలోని భారత కాన్సులేట్ కి కూడా తల్లి తమ కుమార్తెను తిరిగి ఇంటికి పంపించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications