ప్రేమపెళ్లి: కొత్తజంటను వెంటాడిని ఫ్యామిలీ, స్నేహితుడు మృతి, అమ్మాయి ఆవేదన

Subscribe to Oneindia Telugu

ఖమ్మం: జిల్లాలోని గోపాలపురం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందగా, ప్రేమజంటకు తీవ్ర గాయాలయ్యాయి. రహస్యంగా ప్రేమజంట పెళ్లి చేసుకుని పారిపోతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్: కారు ప్రమాదంలో సస్పెండైన బాసర టెంపుల్ మాజీ ఉద్యోగి మృతి

గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

 ప్రాణహాని ఉందని..

ప్రాణహాని ఉందని..

ఆస్పత్రిలో నవవధువు సుమ తెలిపిన వివరాల ప్రకారం.. తాము(సుమ-తరుణ్) వివాహం చేసుకోవడం తమ కుటుంబసభ్యులకు ఇష్టం లేదని చెప్పింది. అందుకే తాము పారిపోయి వివాహం చేసుకున్నామని, తమ కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని తెలిపింది.

 వెంటాడారు

వెంటాడారు

తాము భద్రాచలంలో వివాహం చేసుకుని కారులో హైదరాబాద్ వెళుతుండగా తమ కుటుంబసభ్యులు మరో వాహనంలో తమ వెంటపడ్డారని, తాము తమ వాహనం ఆపకపోవడంతో వారి వాహనంతో ఢీకొట్టించారని చెప్పింది.

 సాయంగా వచ్చిన యువకుడు మృతి

సాయంగా వచ్చిన యువకుడు మృతి

దీంతో తమ కారు అదుపుతప్పి రోడ్డు పక్కను ఉన్న చెట్టుకు ఢీకొందని చెప్పింది.

ఈ ప్రమాదంలో కొత్త జంటకు సాయంగా వచ్చిన యువకుడు మరణించాడు.

 నవవరుడికి తీవ్రగాయాలు

నవవరుడికి తీవ్రగాయాలు

నవ వరుడు తరుణ్ అనే యువకుడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A love couple injured in a accident in Kothagudem district on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి