కామాంధుడు: తల్లితో సహజీవనం చేస్తూ.. నెల రోజులుగా కూతురిపై రేప్
హైదరాబాద్ నగరంలోని నేరేడ్‌మెట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న ఓ కామాంధుడు.. ఆమెతో సహజీవనం చేస్తూనే ఆమె కూతురిపై కన్నేశాడు.
హైదరాబాద్: నగరంలోని నేరేడ్‌మెట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న ఓ కామాంధుడు.. ఆమెతో సహజీవనం చేస్తూనే ఆమె కూతురిపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నేరేడ్‌మెట్ సీఐ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం... అడ్డగుట్టలో ఉంటున్న ఓ వితంతువు(35) దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమె అక్క 11 ఏళ్ల క్రితం చనిపోవడంతో, ఆమె కూతురును పెంచుకుంటోంది. ప్రస్తుతం ఆ బాలిక 6వ తరగతి చదువుతోంది.

అదే ప్రాంతంలో ఉంటున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ ఖలీల్(32)తో, ఆ వితంతు మహిళ గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. కాగా, గత నెల రోజులుగా ఖలీల్.. ఆరో తరగతి చదువుతున్న ఆ బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. బాధిత బాలిక చెప్పడంతో విషయం తెలుసుకున్న ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications