Telangana: అమెరికాలో తెలంగాణ వాసి మృతి..!
సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి అమెరికాలో మరణించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి అమెరికాలో మృతి చెందాడు. దీంతో సొంత ఊరులో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రవీణ్ స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయినట్లు చెబుతున్నారు. ప్రవీణ్ ఐదు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. అతను యూఎస్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
ఏరుకొండ సాంబయ్య, నీలమ్మ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు ఏరుకొండ రాజేష్ ఐదేళ్ల క్రితం యూఎస్ లో ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్లాడు. మిస్సిస్సిపి లోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్ చేశాడు. చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉపాధ్యాయుడి ఉద్యోగంలో చేరాడు. కొద్ది నెలల క్రితం రాజేష్ కాలికి దెబ్బ తగిలింది. దీంతో అతను ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు.

అంత బాగానే ఉంది అని అనుకునేసరికి రాజేష్ స్విమ్మింగ్ పూల్ లో పడిచనిపోయినట్లు తల్లికి నీలమ్మకు సమాచారం వచ్చింది. అయితే రాజేష్ స్విమ్మింగ్ పూల్ లో ఎలా పడ్డాడు.. స్విమ్మింగ్ పడి చనిపోవడానికి అతను ఏమైన చిన్న పిల్లాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. మృతదేహాన్ని సొంతూరు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతోన్నాయి.
రాజేష్ అమెరికాలో ఉండగానే తండ్రి సాంబయ్య చనిపోయారు. 2015లో తండ్రి చనిపోవడంతో రాజేష్ ఇండియాకు వచ్చాడు. మరణానంతరం చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహించి.. తిరిగి యూఎస్ వెళ్లాడు. అప్పుడు భర్త, ఇప్పుడు కొడుకు చనిపోవడంతో నీలమ్మ కన్నీరుమున్నీరు అవుతున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications