సంచిలో లభించిన పసికందు తల ....! మొండెం కోసం పోలీసుల గాలింపు...!

ఆదిలాబాద్‌‌ జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని చిన్నారిని చంపి, తల మొండెం వేరు చేశారు. అనంతరం తలను ఓ సంచిలో పెట్టి రోడ్డుపై పడేశారు. అయితే రక్తం మరకల సంచులు చూసిన స్థానికుల సమాచారంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈనేపథ్యంలోనే ఆ శిశువు ఎవరు, ఎందుకు జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు తల మొండెం వేరు చేసిన ఘటన స్థానికుల్లో సంచనలం రేపుతోంది. కాగా రక్తపు మరకలు ఉన్న సంచిని కాలనీలోని స్థానికలు చూశారు. దీంతో సంచిని తెరిచి చూసి షాక్‌కు గురయ్యారు...మూటగట్టి ఉన్న సంచిలో అప్పుడే పుట్టిన ఓ పసికందు తల ఉంది. దీంతో ఖంగుతిన్న స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు.

a new born baby was killed in adilabad

అయితే పోలీసుల విచారణలో సైతం తల మాత్రమే దొరికింది. కాగా మొండెం మాత్రం దరిదాపుల్లో కనిపించలేదు. దీంతో ఎవరైన కావాలనే హత్య చేశారా, లేక చనిపోయిన పసికందునే సంచిలో పడేసి వెళ్లారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. లేదంటే పసిపాప శవాన్ని ఏవైన జంతువులు పీక్కు తిన్నాయా అనే అనుమానాలు స్థానికుల్లో భయాందోనలకు గురి చేస్తున్నాయి. మరోవైపు తలను వేరు చేసిన మొండం ఎక్కడ ఉండి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+