Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Current Bill: పెంకుటిళ్లు.. ఒక ఫ్యాన్, ఒక బల్బు.. కరెంటు బిల్లు రూ.53,747

ఓ చిన్న గూనపెంకల ఇళ్లు.. అందులో ఒక పంక, ఒక బుగ్గ, అప్పుడప్పుడు ఫోన్ కు ఛార్జింగ్.. ఈ ఇంటికి కరెంట్ బిల్లు(Current Bill) ఎంత వస్తుంది. రూ.100 మహా అయితే రూ.300 వస్తంది. ఇప్పుడు ఎండకాలం కాబట్టి ఫ్యాన్ ఎప్పుడు నడుస్తుంది కాబట్టి రూ.600 వస్తుంది. కానీ ఏకంగా ఆ ఇంటికి రూ.53,747 వచ్చింది. బిల్లు చూసిన ఆ ఇంటి ఓనర్ కు గుండె ఆగినంత పని అయింది. నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామానికి చెందిన సునే సురేష్ కు చిన్న పెంకుటిల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక బల్బు ఉంది. సురేష్ కు ఏప్రిల్ నెలకు సంబంధించి కరెంట్ బిల్లు వచ్చింది.

బిల్లు చూసిన సురేష్ ఒకేసారి షాక్ గురయ్యాడు. తన ఉంటికి రూ.50 వేలకు పైగా బిల్లు రావడమేంటని ఆశ్యర్యపోయాడు. వెంటనే విద్యుత్ అధికారుల వద్దకు పరుగు తీశాడు. చిన్న ఇంటికి ఇంత బిల్లు రావడమేంటి సార్.. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని సురేష్ చెప్పాడు. కానీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. తాను కూలీ పనులు చేస్తూ జీవిస్తానని.. తన వద్ద అంత డబ్బు లేదని.. దయచేసి తనను ఇబ్బందుల్లో పెట్టొద్దని కోరాడు. అయినా పట్టించుకోని అధికారులు బిల్లు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

 currentbill

సురేష్ వద్ద అంత డబ్బు లేకపోవడంతో బిల్లు చెల్లించలేకపోయాడు. దీంతో అధికారులు సురేష్ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ను తొలగించారు. చేసేది ఏమిలేక సురేష్ కుటుంబం కారు చీకట్లోనే ఉంటున్నారు. విద్యుత్ అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా.. బిల్లు కడితేనే విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు. సురేష్ కు రూ.50 వేలకు పైగా బిల్లు రావడంపై గ్రామస్థులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో తప్పు జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో నివాసం ఉంటున్న జిక్కుల రాధకు కూడా భారీస్థాయిలో కరెంట్ బిల్లు వచ్చింది.ఆమె భర్తతో కలిసి ఓ చిన్నపాటి రేకుల గదిలో నివాసం ఉంటోంది. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రాధ దరఖాస్తు చేయగా అధికారులు 2018 ఫిబ్రవరిలో మీటర్‌ అమర్చారు. కానీ, సర్వీస్‌ నంబర్‌ కేటాయించ లేదు. ఈ ఏడాది జనవరిలో సర్వీస్‌ నంబర్‌ కేటాయించారు. వారికి నాలుగేళ్లకు కలిపి ఏకంగా రూ.57వేల బిల్లు వచ్చింది. దీంతో వారు లబోదిబోమన్నారు.

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసుకు జనవరి నెలకు గానూ.. అక్షరాలా 11 కోట్ల 41 లక్షల 63 వేల 672 రూపాయాల కరెంటు బిల్లు వచ్చింది. కేవలం రెండంటే రెండే గదులున్న గ్రామ పంచాయతీయ కార్యాలయానికి నెల కరెంటు బిల్లు ఇంత రావడంపై గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+