Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jeevan Reddy: జీవన్ రెడ్డికి షాక్.. అప్పు చెల్లించాలని నోటీసులు జారీ..!

చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు లోన్లు తీసుకుంటారు. కానీ అవి తిరిగి చెల్లించడానికి ఇష్టపడరు. తాజాగా ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి భార్య కూడా ఇలానే లోన్ తీసుకుని కట్టలేదు. దీంతో రుణం చెల్లించాలని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.20 కోట్లు మొత్తం కలిపి రూ. 40 కోట్లు చెల్లించాలంటూ స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. జీవన్ రెడ్డి తన భార్య పేరు మీద 2017లో స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. ఈలోన్ కు సంబంధించి ఇప్పటి వరకు వడ్డీ కాని, అస్సలు కాని చెల్లించలేదు. అస్సలు ప్లస్‌ వడ్డీ కలిసి రూ.40 కోట్ల బకాయి ఉందని అధికారులు తెలిపారు. దీనిపై జీవన్ రెడ్డి ఇంకా స్పందించలేదు.

A notice has been issued to former Armor MLA Jeevan Reddy to pay the debt

అంతకు ముందు ట్రాన్స్ కో, ఆర్టీసీ కూడా నోటీసులు జారీ చేశాయి. ఆర్మూర్ లోని ఆర్టీసీ స్థలాన్ని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట లీజ్ కు తీసుకున్నారు. ఈ సంస్థకు జీవన్ రెడ్డి భార్య రజిత రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ స్థలంలో భారీ భవనం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో మాల్ తో పాటు మల్టీ ప్లెక్స్ కూడా నిర్మించారు. ఈ మాల్ ను గత సంవత్సరం దసరాకు ప్రారంభించారు. మాల్ బహులజాతి కంపెనీలకు అద్దెకు ఇచ్చారు.

ఈ భవనంలో రిలయన్స్‌ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్‌ సినిమా హాళ్లు ఉన్నాయి. అంత బాగానే ఉన్నా.. ఆర్టీసీ చెల్లించాల్సిన అద్దె.. అలాగే కరెంట్ బిల్లు కూడా చెల్లించలేదు. దీంతో ఆర్టీసీ, ట్రాన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీకి రూ. 7 కోట్లకు పైగా అద్దె చెల్లించాల్సి ఉండగా.. ట్రాన్స్ కోకు 2 కోట్లకు పైగా బిల్లు చెల్లించాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+