బెదిరింపులు: మహిళా కండక్టర్‌పై రేప్ యత్నం
నల్గొండ: విధులు ముగించుకొని ఆర్టీసీ డిపో నుంచి బయటకు వస్తున్న మహిళా కండక్టర్‌పై ఏడిసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి నల్గొండ జిల్లా దేవరకొండలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు గురువారం దేవరకొండలో ఆందోళన చేపట్టారు.
కడప జిల్లాకు చెందిన ఓ మహిళ రెండేళ్లుగా దేవరకొండ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా ఆ డిపోలోనే ఔట్ సోర్సింగ్ కార్మికుడిగా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా ఆమె బుధవారం దేవరకొండ నుంచి కల్వకుర్తి వెళ్లి తిరిగి రాత్రి 9గంటలకు డిపోకి చేరుకున్నారు.

టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును డిపోలో చెల్లించడానికి రాత్రి 9.10గంటలకు వెళ్లారు. సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఏడిసి ఎండి అలీమొద్దీన్ తన మాట వినకుండా కడపకు పంపిస్తానని బెదిరించినట్లు ఆమె చెప్పారు.
డబ్బు చెల్లించి తిరిగి వస్తుండగా ఏడిసి ఆమె చేయిపట్టుకొని బస్సు చాటుకు లాక్కెళ్లి అసభ్యకరంగా, ప్రవర్తించినట్లు ఆమె వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై రేప్, వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై స్పందించిన దేవరకొండ డిపో మేనేజర్ సీతారామకృష్ణ మాట్లాడుతూ.. ఏడిసిని విధులకు దూరంగా ఉంచామని చెప్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications